సన్నీలియోన్‌తో సెల్ఫీలు: ఎగబడిన యువత(ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ గురువారం నగరంలోని కేపీహెచ్‌బీకాలనీలోని మంజీరా మాల్‌లో సందడి చేశారు. తాను నటించిన హిందీ చిత్రం కుచ్ కుచ్ లోతా హై సినిమా ప్రచారంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బిగ్గెస్ట్ సెల్ఫీ విత్ సన్నీ అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
తెలుగులో అందరికీ నమస్కారం అంటూ యువతను ఉత్సాహపరిచారు. ఆమెను చూసేందుకు యువత అమితాసక్తి చూపారు. అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. తొలుత ఆమె హోటల్‌లో మీడియాతో మాట్లాడారు.

'సన్నీ' సందడి, సెల్ఫీల కోసం యువత పోటీ
ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ కుచ్ కుచ్ లోచా హై సినిమా సెక్సీ కామెడీ అని చెప్పారు. నేను నటించే సినిమాల్లో ఏ అంశాలైతే ప్రేక్షకులు ఆశిస్తారో అవి దీనిలో ఎక్కువగా కనిపిస్తాయన్నారు.

'సన్నీ' సందడి, సెల్ఫీల కోసం యువత పోటీ
కానీ ఎక్కడా అసభ్యానికి తావు లేకుండా, నటించానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో గుజరాతీ అయిన ఆమె, ఓ గుజరాతీ అభిమానిని కలుసుకుని తన మేనేజర్‌గా మలచుకున్న తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో సినిమాగా ఉంటుందన్నారు.

'సన్నీ' సందడి, సెల్ఫీల కోసం యువత పోటీ
శుక్రవారం (మే8)న చిత్రం విడుదల కాబోతుంది. అదే రోజు అమితాబ్, దీపికా తదితరులు నటించిన మరో చిత్రం విడుదవుతుంది కానీ ఆ చిత్రం నాకు పోటీ కాదని చెప్పారు. సూపర్ స్టార్స్ నటించిన చిత్రమది. వాళ్లెక్కడ, నేనెక్కడ అని అన్నారు.

'సన్నీ' సందడి, సెల్ఫీల కోసం యువత పోటీ
ఇక కుచ్ కుచ్ లోతా హై సినిమా కోసం కొద్దిగా గుజరాతీ నేర్చుకున్నానని అన్నారు. గతంలో తెలుగు సినిమా చేశారు కాబట్టి తెలుగు నేర్చుకున్నారా అని అడిగితే లేదని చెప్పారు. తెలుగులో కరెంట్ తీగ తర్వాత నేను నటించిన సినిమాలు ఏమీ లేవన్నారు.

'సన్నీ' సందడి, సెల్ఫీల కోసం యువత పోటీ
హైదరాబాద్‌కి గతంలో నాలుగైదు సార్లు వచ్చాను కానీ ఇక్కడ ఏ ప్రాంతాన్నీ చూసే అవకాశం దక్కలేదన్నారు. తెలుగు సినిమా షూటింగ్ ఫిల్మి సిటీలో జరిగింది. నేను చూసిన ఫిల్మి సిటీలలో అత్యుత్తమైన ఫిల్మి సిటీ ఇది ఒకటిగా పేర్కొన్నారు.

'సన్నీ' సందడి, సెల్ఫీల కోసం యువత పోటీ
భారత్‌కు వచ్చిన తర్వాత నన్ను అభిమానించి, ప్రోత్సహిస్తు్న వారు ఉన్నట్లే, వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారని చెప్పారు. అందరి ప్రోత్సాహం వల్లే నేను ఈ స్ధాయిలో ఉన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications