హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మగపిల్లలు వారానికి 7 గంటలు బ్లూఫిల్మ్స్: సర్వే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తరం మారింది. పిల్లల ఆలోచన విధానం కూడా మారుతుంది. ముఖ్యంగా ఈ తరం పిల్లలు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. నిజంగా ఇది తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకుంటే 16 నుంచి 21 ఏళ్ల మద్య వయసున్న వారిలో 66 శాతం మంది మగ పిల్లలు వారానికి ఏడు గంటల చొప్పుల బ్లూఫిల్మ్స్ చూస్తున్నారని ఒక సర్వేలో వెల్లడైంది.

ఇక 30 శాంత మంది ఆడపిల్లలు వారానికి ఐదు గంటలు బ్లూఫిల్మ్స్ చూస్తున్నారని వెల్లడించింది. మగపిల్లలైతే 9 ఏళ్ల వయసు నుండే వీటికి చూస్తున్నారని పేర్కొంది. అంతేకాదు ఈ సర్వేలో వెల్లడించిన విషయాలను చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

కర్ణాటకలోని 183 కాలేజీలకు చెందిన 3,500 మంది విద్యార్ధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. రెస్క్యూ అనే స్వచ్ఛంద సంస్ధ ఈ సర్వేని నిర్వహించింది. విద్యార్ధులను నేరుగా కాకుండా గ్రూపులుగా విభజించి ప్రస్తుత యువతరం బ్లూఫిల్మ్స్‌ను వారానికి ఎన్ని గంటలు చూస్తుంటారు అంటూ పరోక్షంగా ప్రశ్నలు అడుగుతూ వివరాలు రాబట్టారు.

survey says 16 to 21 years childrens seeing blue films

కర్ణాటకలోని బీదర్, మైసూర్, చామరాజనగర్, మండ్య, ధర్వాడ్, బెలగావి, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం ఈ సర్వే మంగుళూరులో కొనసాగుతోంది. ఇందులో 30 శాతం మంది మగపిల్లలు హింసాత్మకమైన బ్లూఫిల్మ్స్‌ను ఇష్టపడుతుండగా, వారానికి 19 రేప్ వీడియోలను చూస్తున్నారు.

ప్రతి ఏటా 1.7 లక్షల మంది విద్యార్ధులు కొత్త కొత్త రేప్ వీడియోలను చూస్తున్నారు. కాగా డిగ్రీకి వచ్చే సరికే దాదాపు 4,900 రేప్ వీడియోలను చూస్తున్నారని ఈ సర్వేలో తేలింది. 84 శాతం మంది పోర్న్ వీడియోలకు చూసి చూసి వాటికి బానిసలుగా మారుతున్నారని చెప్పారు.

పోర్న్ వీడియోలను చూడటం ద్వారా 74 శాతం మంది సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లటం జరుగుతోందని చెప్పారు. ఈ రేప్ వీడియోలను చూడడం ద్వారా 10 శాతం మంది ప్రభావితమై కర్ణాటకలో ఒకే ఏడాదిలో పదమూడు వేల మంది కొత్త రేపిస్టులుగా తయారవుతున్నారని సర్వే నిర్వహించిన సంస్ధ సీఈఓ అభిషేక్ తెలిపారు.

ప్రస్తుత సమాజంలో పిల్లలకు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ వారి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకొచ్చిందని అభిషేక్ హెచ్చిరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించక ముందు 37 శాతం మంది అమ్మాయిలు, పోర్న్ వల్ల ప్రమాదం ఏమీ లేదని, అబార్షన్‌కు అవకాశం ఉంటుంది గనుక పెళ్లికి ముందు సెక్స్ ఓకే అని చెప్పారు.

ఈ సర్వేలో పాల్గొన్న 100 మంది విద్యార్ధుల్లో 50 శాతం మంది తమ క్లాస్ మేట్స్‌లో తమకు సంబంధం ఉందని చెప్పారు. ఈ సర్వేని యావత్ భారత్‌లో నిర్వహించాక రెస్క్యూ సంస్ధ సెప్టెంబర్‌లో పోర్న్ మీద నిషేధాన్ని కోరుతూ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేయనున్నట్లు అభిషేక్ తెలిపారు.

English summary
survey says 16 to 21 years childrens seeing blue films.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X