రేవంత్ రెడ్డి కూతురి పెళ్లిలో చిరు, బాబు (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్ రెడ్డి కూతురు నైమిశా రెడ్డి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్స్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, వ్యాపార, సినీ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కన్నుల పండువగా జరిగిన నిన్నటి పెళ్లి వేడుకకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్. జైపాల్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి తదితరులు ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.
వైసీపీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా ఈ వేడుకకు తరలివచ్చారు. రేవంత్ రెడ్డి కూతురి కోరిక మేరకు పెళ్లిమండపాన్ని అంకోర్ వాట్ దేవాలయం నమూనాను పోలి ఉండేలా డిజైన్ చేశారు. 150 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తులో అచ్చం ఆంకోర్ వాట్ ఆలయాన్ని పోలి ఉండేలా తీర్చిదిద్దారు.
కాంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన కట్టడంగా గుర్తింపు చెందింది. 12వ శతాబ్దంలో ఖెమెర్ రాజుల కాలంలో దీన్ని నిర్మించినట్టు చరిత్రలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన సత్యారెడ్డితో నైమిశా పెళ్లి గతంలోనే కుదిరిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలులో ఉండగానే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగింది.

రేవంత్ రెడ్డి కూతురి పెళ్లిలో చిరు, బాబు
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్ రెడ్డి కూతురు నైమిశా రెడ్డి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్స్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, వ్యాపార, సినీ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రేవంత్ రెడ్డి కూతురి పెళ్లిలో చిరు, బాబు
కన్నుల పండువగా జరిగిన నిన్నటి పెళ్లి వేడుకకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్. జైపాల్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి తదితరులు ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.

రేవంత్ రెడ్డి కూతురి పెళ్లిలో చిరు, బాబు
వైసీపీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా ఈ వేడుకకు తరలివచ్చారు. రేవంత్ రెడ్డి కూతురి కోరిక మేరకు పెళ్లిమండపాన్ని అంకోర్ వాట్ దేవాలయం నమూనాను పోలి ఉండేలా డిజైన్ చేశారు. 150 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తులో అచ్చం ఆంకోర్ వాట్ ఆలయాన్ని పోలి ఉండేలా తీర్చిదిద్దారు.

రేవంత్ రెడ్డి కూతురి పెళ్లిలో చిరు, బాబు
కాంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన కట్టడంగా గుర్తింపు చెందింది. 12వ శతాబ్దంలో ఖెమెర్ రాజుల కాలంలో దీన్ని నిర్మించినట్టు చరిత్రలో ఉంది.

రేవంత్ రెడ్డి కూతురి పెళ్లిలో చిరు, బాబు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన సత్యారెడ్డితో నైమిశా పెళ్లి గతంలోనే కుదిరిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలులో ఉండగానే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగింది.

Click it and Unblock the Notifications