కొత్త పోలీస్ వాహనాలు: కెసిఆర్ సూచన(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం రూపొందించిన హైటెక్ పోలీసు వాహనాలను తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు సోమవారం చూపించారు. వాహనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అందులో స్వల్ప మార్పులు చేయాలని డిజిపి అనురాగ్ శర్మకి సూచించారు. పెట్రోలింగ్ కారు ముందు భాగంలోని లోగో, అక్షరాల సైజులో మార్పులు సూచించారు.
అక్షరాల సైజు పెంచాలని, అలాగే మోటార్ సైకిల్‌కు ప్రస్తుతం ఒకవైపున్న బాక్స్‌ను రెండో వైపు కూడా ఏర్పాటు చేయాలని డిజిపికి సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.
తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యాధునిక హైటెక్ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచేలా, నగరంలో న్యూయార్క్ పోలీసు విధానాల్ని, వాహనాలను ఉపయోగిస్తామని తెలిపారు.
నగరంలో ఎక్కడ ఏ మూలన ఏ సంఘటన జరిగిన పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలా చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా 1650 ఇన్నోవాలు, 1500 మోటార్ బైకులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వాహనాల కొనుగోళ్లకు రూ. 302 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారు. కొత్త వాహనాల డిజైన్‌ను ఇటీవలే ఖరారు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ అందులో స్వల్ప మార్పులు చేర్పులు సూచించారు.

కెసిఆర్
నగరంలో శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం రూపొందించిన హైటెక్ పోలీసు వాహనాలను తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు సోమవారం చూపించారు.

కెసిఆర్
వాహనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అందులో స్వల్ప మార్పులు చేయాలని డిజిపి అనురాగ్ శర్మకి సూచించారు. పెట్రోలింగ్ కారు ముందు భాగంలోని లోగో, అక్షరాల సైజులో మార్పులు సూచించారు.

కెసిఆర్
అక్షరాల సైజు పెంచాలని, అలాగే మోటార్ సైకిల్‌కు ప్రస్తుతం ఒకవైపున్న బాక్స్‌ను రెండో వైపు కూడా ఏర్పాటు చేయాలని డిజిపికి సూచించారు.

కెసిఆర్
ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

కెసిఆర్
తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యాధునిక హైటెక్ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

కెసిఆర్
అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచేలా, నగరంలో న్యూయార్క్ పోలీసు విధానాల్ని, వాహనాలను ఉపయోగిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications