దటీజ్ ఇవాంకా! మాటల్లో నేర్పరితనం.. నిండైన ఆత్మవిశ్వాసం, ట్రంప్‌కు కూతురే పెద్ద రక్ష!

ఇవాంకా ట్రంప్‌... అమెరికా అధ్యక్షుడి గారాలపట్టి. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే ఇవాంకా అంటే ఏమిటో.. అటు అమెరికన్లకూ, ఇటు ప్రపంచదేశాలకూ అర్థమైపోయింది.

Recommended Video

    Ivanka Trump Defends Her Father Always దటీజ్ ఇవాంకా! | Oneindia Telugu

    వాషింగ్టన్: ఇవాంకా ట్రంప్‌... అమెరికా అధ్యక్షుడి గారాలపట్టి. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే ఇవాంకా అంటే ఏమిటో.. అటు అమెరికన్లకూ, ఇటు ప్రపంచదేశాలకూ అర్థమైపోయింది.

    ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆయనకు సలహాదారుగా ప్రభుత్వంలో చేరిన ఇవాంకా ఇపుడు అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరు. ముఖ్యంగా రాజకీయంగా గానీ, ప్రభుత్వ నిర్ణయాలను గానీ ఎవరైనా విమర్శిస్తే వారిని దీటుగా ఎదుర్కొనే బాధ్యతను ఆమే నిర్వర్తిస్తున్నారు.

     ఆయన మాస్ అయితే.. ఆమె క్లాస్...

    ఆయన మాస్ అయితే.. ఆమె క్లాస్...

    తండ్రి ట్రంప్‌ మాటలెంత మాస్‌గా ఉంటాయో ఆయన కుమార్తె ఇవాంకా మాటలు అంత క్లాస్ గా ఉంటాయి. అధ్యక్షుడికి సలహాదారు పదవిలో ఉన్న ఇవాంకా కర్తవ్యాలలో ఒకటి తండ్రిని ప్రతి విషయంలోనూ డిఫెండ్‌ చేయడం. స్వతహాగా టెలివిజన్‌ హోస్ట్‌ కావడం, ఫ్యాషన్‌ డిజైనర్‌ కూడా తోడవడంతో ఆమె మాటలకు అమెరికన్‌ సమాజం అట్రాక్ట్‌ అవుతోంది.. అర్థం పర్థం లేన నిర్ణయాలతో, వ్యాఖ్యలతో విమర్శల పాలవుతున్న ట్రంప్‌కు ఈ పెద్ద కూతురే పెద్ద రక్షణ కవచంగా మారింది.

     మాటల్లో నేర్పరితనం.. నిండైన ఆత్మవిశ్వాసం

    మాటల్లో నేర్పరితనం.. నిండైన ఆత్మవిశ్వాసం

    ఇవాంకా ప్రజెంటేషన్ చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుంది. ఆమె మాటల్లో నేర్పరితనం ఉంటుంది. ఇవాంకా మాట్లాడుతుంటే నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఆమె మాటల్లో వక్రభాష్యాలుండవు. మాట్లాడేటప్పుడు ఎలాంటి తొట్రుపాటుకూ గురికాదు. భవిష్యత్తులో ఆమె అమెరికా అధ్యక్ష రేసులోకి దిగినా ఆశ్చర్యం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తల్లి ఇవానాయే ఓ సందర్భంలో చెప్పారు.

     తండ్రీ కూతుళ్ల మధ్య చాలా వ్యత్యాసం...

    తండ్రీ కూతుళ్ల మధ్య చాలా వ్యత్యాసం...

    అమెరికా అధ్యక్షుడుట్రంప్ కు, ఆయన కూతురు ఇవాంకాకు మధ్య మాటల్లో చాలా వ్యత్యాసం ఉంటుందని ఆమె బాడీ లాంగ్వేజిని అధ్యయనం చేసిన మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆమె బయటికి ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తిలా దర్శనమిస్తున్నా- లోపల మాత్రం తన తండ్రి వ్యవహారాల్ని పూర్తిగా సమర్థించలేని మనస్తత్వం నిండినదని వారు పేర్కొంటున్నారు.

     పబ్లిక్‌గా ఒకలా, ప్రయివేటుగా మరోలా...

    పబ్లిక్‌గా ఒకలా, ప్రయివేటుగా మరోలా...

    తన వ్యక్తిగత సంభాషణల్లో ఇవాంకా స్వేచ్ఛగా, నవ్వుతూ మాట్లాడతారని ఓ నిపుణుడు చెప్పారు. ఓ దేశాధినేత కూతురిగా బయటికి వచ్చినపుడు మాత్రం ఆమె మాట, తీరు పూర్తిగా మారిపోతాయని, ఆమె ఏదో దాస్తున్న విషయం అవగతమవుతుందని నిపుణులు అంటున్నారు. మరోమాటలో చెప్పాలంటే ఇవాంకా.. పబ్లిక్‌గా ఒకలా, ప్రయివేటుగా మరోలా ఉంటారట.

     తండ్రి మాటలకు సిగ్గుతో...

    తండ్రి మాటలకు సిగ్గుతో...

    తండ్రి తో కలిసి టీవీ షోల్లో పాల్గొన్నపుడు.. కొన్నిసార్లు ఆమె ఇబ్బందికర సందర్భాలు కూడా ఎదుర్కొన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఓ టీవీ షోలో ట్రంప్‌ తన కూతురి గురించి మాటాడుతూ.. ‘‘ఆమె నాకు కూతురు కాకపోయి ఉండుంటే, నేను తనతో డేటింగ్‌ చేసేవాణ్ణి..'' అని ఓ చెత్త మాట అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న ఇవాంకా సిగ్గుతో కుచించుకుపోయారు. నేలవైపు చూస్తూ ఉండిపోయారని, ఇది ఆమె వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేస్తుందని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+