దేవుడా... భూమి వైపు దూసుకొస్తున్న తోకచుక్క.. ఢీకొడితే సర్వనాశనమే!
ఓ తోక చుక్క మన భూమి వైపు దూసుకొస్తోంది. అది గనుక పొరపాటున ఢీకొంటే మన భూమి సర్వనాశనం అవుతుందట. అంటే ప్రపంచమే అంతరిస్తుందన్నమాట.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం.. ఓ తోక చుక్క భూమి వైపు దూసుకొస్తుండడమే. అది గనుక పొరపాటున ఢీకొంటే మన భూమి సర్వనాశనం అవుతుందట. అంటే ప్రపంచం అంతరిస్తుందన్నమాట.
45పి పేరుతో పిలుస్తున్న ఈ తోకచుక్క శనివారం ఉదయం అంతర సౌరకుటుంబం మీదుగా ప్రయాణించనుంది. ఈ తోకచుక్క ఐదేళ్లకు ఒకసారి సౌరకుటుంబంలోకి ప్రవేశిస్తుంది. ఈసారి ఇది భూమికి అత్యంత సమీపంగా దూసుకెళ్లనుండడంతో ఖగోళ శాస్త్రవేత్తలలో ఆందోళన వ్యక్తమవుతోంది.
తోక చుక్క ఢీ కారణంగా ఏదైనా నక్షత్ర శకలం భూమిని ధ్వంసం చేస్తుందేమో అనే అనుమానంతో శాస్త్రవేత్తలు దాని గమనంపై నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నారు. దీనికారణంగా ఏదైనా నక్షత్ర శకలం గనుక భూమిని ఢొకొడితే భూమ్మీద సమస్త జీవులూ తుడిచిపెట్టుకుపోతాయని వారు పేర్కొంటున్నారు.

అనేక అణుబాంబులు ఒకేసారి పేలితే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ఈ తోకచుక్క వల్ల కూడా అంతటి ప్రభావం ఉంటుందనేది వారి వాదన. 1950 నుంచి గ్రహాల గమనాన్ని ఆధునిక పద్ధతుల్లో పర్యవేక్షించడం ప్రారంభమైంది.
ఇప్పటి వరకు ఏ తోకచుక్క కూడా భూమికి ఇంత దగ్గరగా ప్రయాణించలేదని, ఇదే తొలిసారి అని 'మైనర్ ప్లానెట్ సెంటర్' శాస్త్రవేత్తలు తెలిపారు. బైనాక్యులర్స్ తో ఈ 45పి తోకచుక్కను స్పష్టంగా చూడవచ్చని.. ఆకుపచ్చని బంతి ఆకారంటో మెరుస్తూ.. ఫ్యాన్ రెక్క వంటి తోకతో ఇది ప్రయాణిస్తోందని వారు పేర్కొన్నారు.
'తూర్పు ఆకాశంలో అధికంగా ఉండే హెర్క్యూలెస్ నక్షత్రమండలం మీదుగా ఈ తోకచుక్క ప్రయాణిస్తోందని, సౌరమండలంలో అత్యంత దగ్గరగా వస్తున్న కారణంగా దాని పరిమాణం కూడా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందని.. ఈ వారాంతంలో ఆకాశం కిందికి ప్రవేశించే 45పి తోకచుక్క కళ్లకు కనిపించేంత దగ్గరగా రాబోతుందని నిపుణులు చెబుతున్నారు..' అని స్పేస్ వెదర్.కామ్ పేర్కొంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications