'మదర్స్ డే' ప్రస్థానం గురించి మీకు తెలియని విషయాలు!..
మే8, 1914న అమెరికా కాంగ్రెస్, మే నెలలోని రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా ప్రకటిస్తూ ఒక చట్టం చేసింది. ఇదే విషయాన్ని మే9,1914న అప్పటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మదర్స్ డే ను అధికారికంగా ప్రకటించారు.
సృష్టిలో అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే.. అది కచ్చితంగా అమ్మనే. కుటుంబ బంధాల పునాదుల మీదే నిర్మితమైన భారత సమాజంలో తల్లి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆమె చేసే గొడ్డు చాకిరీని, ఆ ప్రేమామయి పంచే ప్రేమను దేనితోను వెలకట్టలేం.
ఒకవిధంగా ప్రకృతి అంత స్వచ్చంగా ఇప్పటికీ ప్రేమను నిలుపుకున్న ప్రేమమూర్తి అమ్మ మాత్రమే. పిల్లలను, భర్తను, మొత్తంగా కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పోషించే పాత్ర పైనే సమాజ విలువలు ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ ఆమె శ్రమకు తగిన గుర్తింపు మాత్రం ఇప్పటికీ దక్కడం లేదు.
అయితే 'మదర్స్ డే' రూపంలో ఆ తల్లుల జీవితాలను తలుచుకోవడానికి ఓ రోజంటూ ఏర్పడటం కచ్చితంగా హర్షించదగ్గ విషయం. మరి ఈ మదర్స్ డే ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? అసలెవరు దీనికి నాంది పలికారో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలో తొలిసారి:
అమెరికా సమాజం తొలి మదర్స్ డే నిర్వహించినట్లుగా పరిశీలకులుగా చెబుతారు. సమాజంలో తల్లి పాత్రను, ఆమె చేసే సేవలను గుర్తుచేసుకోవడం కోసం ప్రతీ ఏటా మే రెండో ఆదివారం దీనిని జరుపుకునేవారు. అయితే తొలినాళ్లలో కేవలం మహిళా సంఘాల వారు మాత్రమే ఈ వేడుకలు జరిపినట్లుగా తెలుస్తోంది.

డేకీ మేరీ జార్వీస్ కృషి ఫలితమే:
డేకీ మేరీ జార్వీస్ అనే అమెరికన్ మహిళ కృషితోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే ప్రాచుర్యంలోకి వచ్చింది. తన ఆశయం నెరవేరకుండానే కన్నుమూసిన తల్లిని తలుచుకోవడం కోసం మదర్స్ డే ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆమె మదిలో కలిగింది. దీంతో తన ఆలోచనకు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే దిశగా ఆమె అడుగులు వేసింది.

అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని:
తన ప్రయత్నంలో భాగంగా.. 'మదర్స్ డే'ని అంతర్జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని జార్వీస్ తీవ్రంగా ప్రయత్నించింది. తన ఆలోచనకు మద్దతు కూడగట్టేందుకు చాలామందిని తనతో పాటు నడిపించింది. ఈ కృషి ఫలితంగానే పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో 1910లో తొలిసారి మదర్స్ డే రోజు అధికారిక సెలవుదినాన్ని ప్రకటించారు.

మే నెలలో రెండో ఆదివారం:
పశ్చిమ వర్జీనియా తర్వాత అమెరికాలోని మిగతా రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాయి. మే8, 1914న అమెరికా కాంగ్రెస్, మే నెలలోని రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా ప్రకటిస్తూ ఒక చట్టం చేసింది. ఇదే విషయాన్ని మే9,1914న అప్పటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మదర్స్ డే ను అధికారికంగా ప్రకటించారు. యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ పౌరులకు నివాళులు అర్పించే రోజు గాను ఈ మదర్స్ డేను అక్కడివారు పరిగణిస్తున్నారు.

మదర్స్ డే స్టాంపు:
అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డీ రూజ్ వెల్డ్ 1934లొ 'మదర్స్ డే' మీద ఒక స్టాంపు విడుదల చేశారు. 2008సంవత్సరం, మే నెలలో యూఎస్ ప్రతినిధుల సభ మదర్స్ డే స్మారకోత్సవ తీర్మానం కోసం రెండుసార్లు ఓటింగ్ నిర్వహించింది. మొదటి సభలో అమెరికా కాంగ్రెస్ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.

అంతర్జాతీయ తల్లుల ఆలయం:
మదర్స్ డే ప్రస్థానం ప్రారంభమైన తొలి వేదిక గ్రాప్టన్స్ చర్చి ప్రస్తుతం ప్రపంచ తల్లుల ఆలయంగా కొనియాడబడుతోంది. అంతేకాదు, జాతీయ చారిత్రక ప్రదేశంగాను ఇది చరిత్రకెక్కింది. మదర్స్ డే వెనుక ఉన్న ఇంత చరిత్ర ఉంది కాబట్టే.. ప్రస్తుతం ప్రతీ దేశంలో ప్రతీ ఇంట్లో 'మదర్స్ డే'ను ఘనంగా నిర్వహించుకునే సాంప్రదాయం కొనసాగుతోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications