నాకు హెచ్ఐవీ పాజిటివ్: రష్యా టీవీ యాంకర్ ప్రకటన
మాస్కో: తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని ఓ న్యూస్ రీడర్ బహిరంగ ప్రకటన చేశాడు. అతను రష్యాలో పాపులర్ టీవీ హోస్ట్. మంగళవారం రాత్రి ఆయన ఈ ప్రకటన చేశాడని వార్తలు వస్తున్నాయి. తాను పని చేస్తున్న ఛానల్‌లో ఒక కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ... అతను ఈ ప్రకటన చేశాడు.
డాజ్‌డ్ అనే ఇండిపెండెంట్ టీవీ స్టేషన్లో పావెల్ లోబ్కోవ్ పని చేస్తాడు. డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా టీవీలో ఒక కార్యక్రమం జరుగుతుండగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. లోబ్కోవ్ తనకున్న వ్యాధి గురించి బహిరంగంగా చెప్పడంతో రష్య న్ ప్రజలు, సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

తనకు మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా అతను కృతజ్ఞతలు తెలిపారు. 2003లో తనకు ఈ వ్యాధి సోకిందని, తన మెడికల్ ఫైల్ పైన హెచ్ ఐవీ + అని నాడు డాక్టర్ రాసిన విషయాన్ని లోబ్కోవ్ ప్రస్తావించారు.
తన క్లినిక్‌లో ఎక్కువ కాలం ట్రీట్మెంట్ ఇవ్వడం వీలుపడదని డాక్టర్ చెప్పినప్పుడు, తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్నారు. కానీ ఇప్పుడు తాను ఒక మంచి స్థానంలో ఉన్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications