అంతా షాక్: పెళ్లి కొడుకుతోపాటు బావిలో పడిన గుర్రం(వీడియో)
పెళ్లి వేడుకలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో పెళ్లి కొడుకును తీసుకెళ్తున్న గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయి ఓ బావిలో పడింది.
లక్నో: పెళ్లి వేడుకలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో పెళ్లి కొడుకును తీసుకెళ్తున్న గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయి ఓ బావిలో పడింది. దీంతో పెళ్లికొడుకు కూడా గుర్రంతోపాటే బావిలో పడిపోయాడు. ఇదంతా కొందరు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోండా ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి జేసీబీని అక్కడకు తీసుకొచ్చారు. జేసీబీ సాయంతో పెళ్లి కొడుకును, ఆ తర్వాత గుర్రాన్ని బావిలోంచి తీశారు.
#WATCH: Rescue operation of a horse that fell into a well alongwith the bridegroom during a wedding ritual in Uttar Pradesh's Gonda(July 12) pic.twitter.com/LwxkL11f27
— ANI UP (@ANINewsUP) July 13, 2017
ఈ ఘటనలో పెళ్లి కొడుకుకు చిన్న చిన్న గాయాలయ్యాయి. గుర్రం కూడా స్వల్ప గాయాలతో బయటపడింది.
పెళ్లి కొడుకు బావిలో పడిపోయాడన్న విషయం తెలిసి అతని కుటుంబంతోపాటు వధువు కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చిన్నపాటి గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications