ఆసీస్ పార్టీ: దుస్తులిప్పేసిన ఫౌల్కనర్
మెల్బోర్న్: ప్రపంచ కప్ గెలిచిన రాత్రిని ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎలా సెలెబ్రేట్ చేసుకొనివుంటారనేది ఆసక్తికరమైన విషయమే వన్డేలకు గుడ్‌బై చెప్పేసిన కీపర్ బ్రాడ్ హాడిన్ తమ జట్టు సంబరాల్లో కొన్నింటిని పంచుకున్నాడు.
"ఎవరికీ చెప్పరంటే ఓ సంగతి చెబుతా.. ఫాల్క్‌నర్ అయితే బట్టలన్నీ విప్పేశాడు (మందు మత్తులో!) మా కోచేమో మాట్లాడలేని స్థితిలో (మందులో?) వరల్డ్‌కప్‌లో స్పూన్ వేసి ఏదో తోడేందుకు ప్రయత్నించాడు. ఇక మార్ష్ సోదరుల (షాన్, మిచెల్)తోనైతే నేను అస్సలు మాట్లాడలేని స్థితి. మీరిప్పటికే కనిపెట్టి ఉండాలి వారెంత ఇబ్బందుల్లో ఉన్నారో (మందు మత్తులో) అనేది" హాడిన్ చెప్పాడు.

మరిన్ని విషయాలను కూడా అతను చెప్పాడు. "హెజిల్‌వుడ్ మాత్రం మందు ముట్టుకోడు. మందుతో అతనికి పీడకలలాంటి గతముందని అన్నాడు. ఇక మ్యాచ్ సందర్భంగా గుప్టిల్, ఇలియట్‌లను తన మాటలతో రెచ్చగొట్టడంపై స్పందిస్తూ, టీమ్ మీటింగ్‌లో ముందే చెప్పేశా.. వన్డేల్లో కీపర్‌గా నాకిదే చివరి మ్యాచనీ, అందుకే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఎంతవరకు వీలైతే అంత వరకు మాటల యుద్ధం సాగించాలని చెప్పా. చివరి వన్డే ఆడుతున్న నన్నైతే, వన్డేలు ఆడకుండా సస్పెండ్ చేయలేరు కదా" అని హాడిన్ ముగించాడు.
రాత్రంతా జట్టు సభ్యులతో విజయం సాధించిన ఆనందంలో పార్టీ చేసుకున్న హడిన్ సిడ్నీ రేజియే స్టేషన్ నుంచి మాట్లాడాడు. తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని ఆయన అన్నాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications