మారిటల్ రేప్: భారత భర్తలు బతికిపోయారు?

న్యూఢిల్లీ: భారతదేశం పరిస్థితుల నేపథ్యంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించేందుకు సిద్ధంగా లేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇష్టం లేకున్నా, ఆమె సమ్మతి లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా అనుభవించడాన్ని నేరంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాన్ని సవరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. అంతర్జాతీయ నిర్వచనం వేరు, భారత సమాజ స్థితిగతులు వేరు అని భారత ప్రభుత్వం భావిస్తోంది.

భారత్‌లో 75 శాతం మంది మహిళలు భర్తల చేతిలో బలాత్కారాలకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి చెప్పింది. దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేమని మంత్రి స్పష్టం చేశారు. మారిటల్ రేప్‌ను భారత్ వంటి సమాజంలో నేరంగా చేయలేమని, ఇక్కడ పెళ్లిని పవిత్రమైందిగా భావిస్తామని మంత్రి చెప్పారు.

Why India not considering Marital rape?

మహిళ అంగీకారం లేకుండా ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది నేరమేనని, అది రేప్ కిందికే వస్తుందని, అది పెళ్లాడిన భర్త కావచ్చు, సహజీవనం చేస్తున్న వ్యక్తి కావచ్చు, ప్రేమికుడు మరెవరైనా కావచ్చు అని అంతర్జాతీయంగా ఇచ్చిన నిర్వచనం.

దానికి అనుగుణంగా భారత్ సంబంధిత చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం యోచిస్తుందా అంటూ డిఎంకె సభ్యురాలు కనిమొళి వేసిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి జవాబులు ఇచ్చారు. దాన్ని బట్టి భారత ప్రభుత్వ వాదన ఏమిటనేది అర్థమవుతోంది.

మంత్రి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి....

మన సమాజంలో అక్షరాస్యత శాతం, పేదరికం, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, విలువలు, మతపరమైన విశ్వాసాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించాలనే డిమాండ్‌ను అమలు చేయడం అంత సులభం కాదు.

అత్యాచార సంబంధిత చట్టాలను సమీక్షించి 172వ నివేదిక సమర్పించినప్పుడు లా కమిషన్ కూడా భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించాలని సిఫారసు చేయలేదు. అందువల్ల చట్టాన్ని సవరించే ప్రతిపాదన ఏదీ లేదు.

మహిళలపై వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి కమిటీ మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని భారత్‌కు సిఫార్సు చేసింది. ఆ విషయాన్ని భారత విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ దృష్టికి తెచ్చాయి.

నిర్భయ ఉదంతం తర్వాత ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ మారిటల్ రేప్‌కు ఉన్న మినహాయింపును తొలగిస్తూ ఐపిసిని సవరించాలని సిఫారసు చేసింది. అయితే, ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు.

మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే అమలు చేసేటప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయని హోం శాఖ అభిప్రాయపడింది. భారత్‌లో కుటుంబ విలువలకు విఘాతమని కూడా అభిప్రాయపడింది. పెళ్లి చేసుకోవడం అంటేనే సమ్మతిగా మన సమాజం పరిగణిస్తుంది. క్రిమినల్ లా (సవరణ) బిల్లు - 2012పై ఏర్పాటైన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆనాడు హోంశాఖ అభిప్రాయంతో ఏకీభవించింది.

మొత్తం మీద, ప్రభుత్వ వైఖరి భారతదేశంలో పురుషులకు ఊరట నిచ్చే విధంగా ఉంది. ప్రభుత్వ వైఖరిపై మహిళా సంఘాలు ఎలా ప్రతిస్పందిస్తాయనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+