యూత్ స్పెషల్ : లవ్ చాటింగ్

ఈ మధ్య రజని మొబైల్‌కు అతుక్కుపోయి ఉంటోంది. ఎప్పుడు చూసిన సుతారంగా తన వేళ్లను కదిలిస్తూ ఏదో టైప్ చేస్తూ ఉంటోంది.

మధ్య మధ్యలో ఆమె ముఖంలో భావాలు మారుతున్న విషయాన్ని కనిపెట్టవచ్చు. ముఖ కవళికలు మారడానికి ఆ వేళ్లను అలా సుతారంగా కదిలించడానికి సంబంధం ఉంది. ఆమె చాటింగ్ చేస్తోంది. ఆ చాటింగ్‌లో తన ప్రియుడి మాటలను బట్టి ఆమె హృదయంలో సంచలనాలు కలుగుతున్నాయి. అది ముఖంలో ప్రస్ఫుటిస్తోంది.

అతను ఈ మధ్యనే పరిచయమయ్యాడు. పరిచయంతోనే ఆకట్టుకున్నాడు. సరదా మాట్లాడుతాడు. పక్కన ఉన్నంత సేపూ నవ్విస్తూ ఉంటాడు. ఆరడుగుల అందగాడేమీ కాదు గానీ చూడ్డానికి బాగుంటాడు.

తన బంధువుల పెళ్లి పరిచయం జరిగింది. ఆ పెళ్లి సందడిలో అతను తనను ప్రత్యేకంగా చూస్తున్నట్లు కనిపెట్టింది రజని. దాంతో అతని పట్ల ఆమెకు కూడా ఏదో ఉత్సుకతలాంటి ఆసక్తి కలిగింది. దాంతో అతన్నే గమనిస్తూ ఉండిపోయింది. అతను కూడా తనను గమనిస్తున్నట్లు ఆమె గుర్తించింది.

Youth special: Love story

అలాంటి సందర్భాల్లో ఆమె హృదయంలో అలజడి ప్రారంభమైంది. ఆ అలజడికి కారణం ఏమిటో ఆమెకు తెలియదు. కానీ, ఏదో జరుగుతుందనే గ్రహింపు మాత్రం ఉంది. ఏం జరుగుతుంది, తాను అతని పట్ల ఆకర్షితురాలిని అవుతున్నానా అనిపించింది.

అతనెవరో, ఎలాంటివాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. అలాంటి వ్యక్తి మీద ఆసక్తి పెంచుకోవడం సరి కాదని కూడా అనుకుంది. కానీ, అతని పట్ల ఆకర్షణ మాత్రం పెరిగిందే తప్ప తరగలేదు.

ఆమె పట్టుపరికిణీలో, అందమైన జాకెట్టుతో మెడలో నగలతో అందంగా మెరిసిపోతోంది. అచ్చం ఆరణాల తెలుగు అమ్మాయిలా ఉంది. పెళ్లి కాబట్టి ఆమె ప్రత్యేకంగా తయారైంది. తాను గోడకు ఒరిగి మాట్లాడుతున్నప్పుడు అతను టక్కున తన మొబైల్‌తో ఆమె ఫొటో తీశాడు.

ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోపం కూడా వచ్చింది. వెంటనే అతని వద్దకు వెళ్లి, ఫొటో ఎందుకు తీసుకున్నావని తగాదాకు దిగింది.

నువ్వు బాగా అనిపించావు, తీశాను అని చెప్పాడు.

అమ్మాయిలు బాగా అనిపిస్తే ఫొటో తీస్తావా అని నాగుపాములా బుసకొట్టింది. అతను నవ్వాడు

తల్లీ... నా ఆనందం కొద్దీ తీశానే గానీ నీకేదో చేద్దామని కాదు అన్నాడు.

ఇద్దరు చాలా సేపు గొడవ పడ్డారు. అలా పరిచయం పెరిగి, మంచి స్నేహితులుగా మారారు. అది ప్రేమగా కూడా మారింది. ఆ ప్రేమ ఫలితంగానే ఆమె ఇప్పుడు అతనితో చాటింగ్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+