'ఫ్యాషన్ గర్ల్': చీర గొప్పతనంపై రోజా (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్‌కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో 'ఫ్యాషన్ గర్ల్' పేరిట ఏర్పాటు చేసిన వస్త్ర, హస్తకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో చేనేత, చేతివృత్తులకు విశేష స్థానం ఉందని అన్నారు. విదేశీ వనితలూ చీరకట్టేందుకు ఆసక్తి చూపడం చీర గొప్పతనమని అన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులను పరిశీలించారు.
అనంతరం ప్రదర్శనలోని పలు చీరలతో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు రూపొందించిన ఉత్పత్తులను ఈ వస్త్ర ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ వస్త్రప్రదర్శన ఈనెల 15వరకు కొనసాగుతుందని నిర్వాహకులు కవితారెడ్డి, కల్పానారెడ్డి, సాయి మనోజ్ఞరెడ్డి తెలిపారు.

ఫ్యాషన్ గర్ల్
చీర గొప్పతనంపై రోజా

ఫ్యాషన్ గర్ల్
చీర గొప్పతనంపై రోజా

ఫ్యాషన్ గర్ల్
చీర గొప్పతనంపై రోజా

ఫ్యాషన్ గర్ల్
చీర గొప్పతనంపై రోజా












Click it and Unblock the Notifications