చిరంజీవి వర్సెస్ బాలయ్య

చిరంజీవికి, ఆయన సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లుడు అర్జున్ లకు రాష్ట్రంలో ఉన్న అభిమానుల సందడికి బాలకృష్ణ, ఆయన కుమారుల అభిమానుల సందడికి ఏ మాత్రం తీసిపోదు. పైగా, ఈ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కూడా. దీంతో చిరంజీవి కన్నా తమ అభిమాన నటుడు బాలకృష్ణదే పైచేయి కావాలనే కావాలనే కసితో బాలయ్య అభిమానులు పని చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొంత మంది అభిమానులకు పార్టీ టికెట్లు ఇప్పిస్తానని కూడా ఆయన చెప్పారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ టికెట్ ఇప్పించుకుని నానిని శాసనసభ్యుడిగా గెలిపించుకున్నారు. అయితే, విజయవాడ పార్లమెంటు సీటుకు తెలుగుదేశం పార్టీ టికెట్టుపై పోటీ చేసి చిరంజీవి మద్దతిచ్చినా ఓడిపోయారు. ఇప్పుడు కూడా అశ్వనీదత్ తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని అశ్వనీదత్ కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
తెలంగాణ, రాయలసీమల సంగతి అలా ఉంచితే, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నందమూరి హీరోల ప్రభావం ఇతోధికంగా ఉంటుంది. ఫ్లాప్ హీరోగా పేరు పొందిన తారకరత్న ఇటీవల ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రాజకీయ సభలు పెడితే కూడా విశేష స్పందన లభించింది. ఇక, నలుగురు కలిసి, విడివిడిగా సభలు పెడితే, ప్రచార రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవి, ఆయన సోదరుల ఇమేజ్ ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే పోటీ మాత్రం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండవచ్చు. అంతేకాకుండా, ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సభలకు విశేష స్పందన లభించింది. తెలుగుదేశం పార్టీ ఈ విధమైన సంస్ధాగత బలం కూడా ఉంది. ఉత్తరాంధ్రలో చిరంజీవి స్వీప్ చేయవచ్చుననే మాట వినిపిస్తోంది. కానీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. రాజకీయ నాయకుల వలసలు కొంత మేరకు మాత్రమే బలాబలాలను ప్రభావితం చేయగలుగుతాయి.
పైగా, కోస్తాంద్రలో చిరంజీవి, బాలయ్య అభిమానుల కూర్పుకు కులప్రాతిపదిక ప్రధానంగా పనిచేస్తున్నది. కులం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గణనీయంగా పనిచేస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఇక తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు వస్తే, రాయలసీమలో కాంగ్రెసుది పైచేయి కావచ్చు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి పెరిగిన ప్రతిష్ట ఇక్కడ ప్రధానంగా పనిచేస్తుంది. తెలంగాణలో వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎటు వైపు ఆ పార్టీ ప్రయోజనం పొందుతుంది. అందువల్ల చిరంజీవికి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం నల్లేరు మీద బండి నడక ఏమీ కాదు.












Click it and Unblock the Notifications