చంద్రబాబు వ్యూహం

ఇకపోతే, కోస్తా ప్రాంతంలో చిరంజీవి హవాను అడ్డుకోవడానికి తన బావమరిది బాలకృష్ణను చంద్రబాబు ప్రయోగిస్తున్నారు. బాలకృష్ణ వచ్చే నెల మూడో వారం నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి రంగంలోకి దిగుతారు. చిరంజీవి ఇమేజ్ కు బాలకృష్ణ ఇమేజ్ ను అడ్డువేయడం కోస్తాలో ఆయన అనుసరించే వ్యూహం. బాలకృష్ణకు కూడా చిరంజీవికి ధీటుగా అభిమానులున్నారు. అంతేకాకుండా రాయలసీమలో కూడా బాలకృష్ణ ఇమేజ్ పనికి వస్తుందని ఆయన భావిస్తున్నారు. బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న రంగంలోకి దిగుతారు. హరికృష్ణ ఉండనే ఉన్నారు. నందమూరి వంశం ప్రజారాజ్యం గాలిని ఎదుర్కుంటుంది. ఈ రకంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పార్టీ నుంచి కొంత మంది వెళ్లిపోవడం వల్ల కూడా పెద్దగా నష్టం ఉండదనేది ఆయన అంచనా. స్థానికంగా మొదటి స్థాయి నాయకత్వం వెళ్లిపోవడం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అవకాశం ఇవ్వడానికి వీలవుతుందని, దీనివల్ల వారు ఉత్సాహంగా పనిచేస్తారని ఆయన అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారుతుంది. చిరంజీవి ప్రజారాజ్యం అస్తిత్వంలోకి వచ్చినందున ఈ ప్రమాదం ముంచుకొచ్చింది. దీంతో సర్వశక్తులూ ఒడ్డడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు.












Click it and Unblock the Notifications