అరుణకుమారి వర్సెస్ రోజా

చిరంజీవికి మహిళలపై గౌరవం లేదని, చిరంజీవి కుటుంబంలోని మహిళలకే సరైన గౌరవం లేదని ఆమె విమర్శిస్తున్నారు. సినిమాల్లో స్త్రీలను గౌరవించే సంప్రదాయం చిరంజీవికి లేదని ఆమె పలు మార్లు వ్యాఖ్యానించారు. చంద్రగిరి సీటును పట్టుబట్టి రోజా దక్కించుకున్నారు. ఈ సీటును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆశించారు. రామ్మూర్తి నాయుడికే టిక్కెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ఒకానొక సందర్భంలో వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఆ సమయంలో అలక వహించారు. అంత వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై తాను పోరాటం చేశానని, తనకు న్యాయం చేయడం ధర్మమని ఆమె చెప్పుకున్నారు. బెల్టు షాపులపై ఆమె దాడి కూడా చేశారు. చంద్రగిరిలో పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ నాయకత్వం అందుకు సిద్ధంగా లేరని వార్తలు రావడంతో ఆమె అలక వహించారు. దీంతో ఆమెను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. ఆమెకు సీటు గ్యారంటీ చేశారు. వెంటనే ఆమె ఎన్నికల కయ్యానికి కాలు దువ్వారు.
నిజానికి, రోజాకు ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు సహకరించబోరనే వార్తలు వచ్చాయి. అయితే, రామ్మూర్తి నాయుడితో సయోధ్య కుదుర్చుకుని మార్గం సుగమం చేసుకున్నారు. రామ్మూర్తినాయుడు, రోజా ఒకే వేదిక మీదికి వచ్చి ఎన్నికల వేడి ప్రారంభం కాక ముందే ఐక్యతారాగం ఆలపించారు. ఇప్పుడు మంత్రి గల్లా అరుణకుమారిని ఎదుర్కుంటున్నారు. గల్లా అరుణకుమారిపై రోజా గెలిస్తే అది ప్రధానమైన రాజకీయ సంఘటనే అవుతుంది.












Click it and Unblock the Notifications