రోశయ్యపై బాబు మెతక వైఖరి

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెతక వైఖరి అవలంబిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరిన చంద్రబాబు ఇప్పుడు మెతకగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం సాయం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రోశయ్యను తప్పు పట్టడానికి ఆయన వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలని ఆయన అన్నారు. తీవ్ర స్వరంతో ఆయన చంద్రబాబు విమర్సలు లేకపోవడం ప్రభుత్వ సహాయక చర్యలపై వ్యాఖ్యల సందర్భంలో కనిపిస్తోంది.

చంద్రబాబు రోశయ్య పట్ల అనుసరిస్తున్న మెతక వైఖరికి పెద్దగా కారణం కనిపించడం లేదు. రోశయ్య సామాజిక వర్గమే ఆయన మెతక వైఖరి అవలంబించడానికి ఒక కారణమని కొందరు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పటిష్టంగా కనిపించి తమ పార్టీకి సవాల్ గా పరిణమించింది. తమ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి ఒక్కరొక్కరినే కాంగ్రెసులోకి లాగుతుండడం ఆయన పెద్ద యెత్తున ఇరకాటంలో పెట్టిందని భావించవచ్చు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి నాయకులు, శాసనసభ్యులు వైయస్ అనుకూల వైఖరితో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఎదురు తిరిగారు. రోజా లాంటి డైనమిక్ లీడర్స్ కూడా పార్టీ నుంచి వెళ్లి పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. రోశయ్యకు రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బ తీసే శక్తి లేదని భావించడమే చంద్రబాబు మెతక వైఖరికి కారణం కావచ్చునని అంటున్నారు.

వ్యక్తిత్వం రీత్యా కూడా ప్రత్యర్థులను ఇబ్బందుల్లో పెట్టే మనస్తత్వం రోశయ్యకు లేదు. పైగా, సొంత గూటిలోని సహాయ నిరాకరణతోనే రోశయ్య సతమవుతున్నారు. రోశయ్యపై తాము తీవ్ర విమర్సలు చేస్తే ఆయన బలపడే అవకాశాలున్నాయని కూడా చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. బలహీనమైన ప్రత్యర్థి పట్ల మెతక వైఖరి అవలంబించడమే సరైన ఎత్తుగడగా కూడా ఆయన భావిస్తూ ఉండవచ్చు. తనకు ఇబ్బందికరంగా పరిణమించినప్పుడు ఎదుర్కోవడానికి అస్త్రశస్త్రాలను సంధించాలే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వాటికి పదును పెట్టడం సరైంది కాదని చంద్రబాబు మనోగతమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+