బాబు 'మధ్యంతరం' ఆశ

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినా, చేయకున్నా కాంగ్రెసు పార్టీలో చీలిక అనివార్యమని భావిస్తున్నారు. కాంగ్రెసు తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకుంటుందని ఆయన నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ ను శాసనసభ్యులంతా కలిసికట్టుగా ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారని ఆయన నమ్మడం లేదు. ఒక వేళ జగన్ ను ముఖ్యమంత్రిగా పార్టీ అధిష్ఠాన వర్గం నామినేట్ చేస్తే తాత్కాలికంగా అంగీకరించినా కొంత మంది శాసనసభ్యులు తిరుగుబాటు చేయడం ఖాయమని ఆయన తన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే వైయస్ వర్గీయులు అసమ్మతి సెగ రాజేసి ప్రభుత్వాన్ని కూల్చడం తప్పదని ఆయన అంటున్నారట.
జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే శాసనసభ్యుల్లో కొంత మంది తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతోనే వైయస్ వర్గీయులు ఇటీవల ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మద్దతు కోరారు. దీన్ని బట్టే వైయస్ వర్గీయుల్లో ఆత్మ విశ్వాసం లేకపోవడం గమనించవచ్చునని అంటున్నారు. జగన్ కు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ శాసనసభలో మెజారిటీకి ఆ సంఖ్య సరిపోదు. అందుకే అస్థిరత్వంపై చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. ఈ స్థితిలో శాసనసభకు నాలుగున్నర ఏళ్ల లోపే ఎన్నికలు వస్తాయని చంద్రబాబు తన మిత్రులతో చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా రంగాన్ని సిద్ధం చేసుకోవాలని ఆయన పార్టీ నాయకులకు కూడా సూచిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications