కెసిఆర్, బాబు కలిసికట్టుగానే..?

చంద్రబాబును అమెరికా కాన్సులేట్ అధికారులు పీటర్ బర్లీ, స్టీవెన్ జె వైట్ కలుసుకోవడం కూడా వివాదాస్పంగా మారింది. పీటర్ బర్లీ భేటీతో వామపక్షాలు భయాలు మరింతగా పెరుగుతున్నాయి. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి తెలుగుదేశం నాయకుడు కంభంపాటి రామ్మోహన్ రావు ప్రయత్నించారు. పీటర్ బర్లీ చంద్రబాబు కలయికలకు రాజకీయ ప్రాధాన్యం లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తృతీయ కూటమి అధికారంలోకి వస్తే అణు ఒప్పందాన్ని సమీక్షిస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే పీటర్ బర్లీ మరో వైపు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కూడా కలుసుకున్నారు. ఫలితాలు వెలువడడానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్న ఈ సమయంలో పీటర్ బర్లీ భేటీలకు ప్రాధాన్యం చేకూరింది. పీటర్ బర్లీ బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీని కూడా కలుసుకున్నట్లు సమాచారం. ఈ భేటీలతో కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారే ప్రమాదం ఉండవచ్చునని వామపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అంటున్నారు. ఈ స్థితిలోనే చంద్రబాబు ఎన్డేయే వైపు వెళ్లే అవకాశాలు లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్డీయేలోకి చంద్రబాబును కూడా తెస్తారా అని అడిగితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఏమీ జవాబివ్వలేదు. అంటే ఏదో మతలబు ఉందనే భావన అని అంటున్నారు. ఎన్నికలకు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. చంద్రశేఖర రావు ఎన్డీయెతో కలిసి పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని రద్దు చేసి తెరాసలో చేరారని సమాచారం. చంద్రశేఖరరావు, చంద్రబాబు కలిసి రూపొందించుకున్న వ్యూహం ప్రకారమే నడుచుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications