లగడపాటి మూడో కొడుకు లడాయి

లగడపాటి రాజగోపాల్ మాజీ కేంద్ర మంత్రి, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర కూతురు పద్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూమారులు. తన కూతురికి ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారని, మూడో కుమారుడి గురించి లగడపాటి చెప్పాలని ఉపేంద్ర అన్నారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు లగడపాటి రాజగోపాల్ ముందు ప్రస్తావించారు. దానికి లగడపాటి ఏ మాత్రం తొనకకుండా ఆ విషయం ఉపేంద్రనే అడగండని ఆయన చెప్పారు. తాను చెప్పాల్సింది అఫిడవిట్ లో చెప్పానని ఆయన అన్నారు.
ఉపేంద్రకు, లగడపాటి మధ్య చాలా కాలంగా పడడం లేదు. ఇద్దరి మధ్య వైరం గురించి అందరికీ తెలుసు. అయితే ఈ వైరం దేని కోసమనేది మాత్రం తెలియదు. విజయవాడ పార్లమెంటు సీటు నుంచి గతంలో ఉపేంద్ర పోటీ చేశారు. అయితే లగడపాటి రాజగోపాల్ కు గతంలో కాంగ్రెసు విజయవాడ లోకసభ సీటు ఇచ్చింది. ఏమైనా లగడపాటికి వివాదాలంటే చాలా ఇష్టం. తాజాగా తనంత తానే కొత్త వివాదానికి తెర తీశారు.












Click it and Unblock the Notifications