సిఎం రేసులో డిఎస్?

D Srinivas
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే వైయస్ రాజశేఖర రెడ్డే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారు. పూర్తి మెజారిటీ సాధించినప్పుడు అసమ్మతి ఎదురైనా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని షీలా దీక్షిత్ కే కట్టబెట్టినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని వైయస్ కు పార్టీ అధిష్ఠానం అప్పగించే అవకాశాలున్నాయి. పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే మాత్రం ముఖ్యమంత్రి ఖాయమని అంటున్నారు. ఈ స్థితిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిఎస్ పేరు ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు కూడా చెబుతున్నారు. అందుకే ఆయన అకస్మాత్తుగా ఆదివారంనాడు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సమాచారం. ఢిల్లీకి వెళ్లి చేసేదేముందని శనివారంనాడు మీడియా ప్రతినిధులను ప్రశ్నించిన డిఎస్ అకస్మాత్తుగా ఆదివారంనాడు అక్కడికి బయలు దేరుతుండడం వెనక మతలబు పెద్గగానే ఉందని భావిస్తున్నారు.

రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రానున్నట్లు ఇప్పటికే పార్టీ నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. హంగ్ ఏర్పడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై పార్టీ అధిష్ఠానం చర్చించడమే కాకుండా కాబోయే ముఖ్యమంత్రిగా అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని డిఎస్ కు సూచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కోసం ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మద్దతు పొందాలనే ఆలోచన ఇప్పటికే ఉన్నప్పటికే ఉన్నట్లు చెబుతున్నారు. ఈపాటికే కొందరు కాంగ్రెసు నాయకులు ప్రజారాజ్యం నాయకులతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తిరుపతిలో కాంగ్రెసు అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి నుంచి ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా చిరంజీవి తిరిగి వైయస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించకపోవచ్చునని తెలుస్తోంది. కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి అండదండలతోనే తనను తిరుపతి నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారని చిరంజీవి గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో మరో నాయకుడిని ముఖ్యమంత్రిగా కాంగ్రెసు పార్టీ ముందుకు తేవాల్సి ఉంటుంది. అందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటే మంచిదనే అభిప్రాయం పార్టీ అధిష్ఠానవర్గంలో ఉన్నట్లు చెబుతున్నారు.

డిఎస్ మరో రెండు కారణాలు కూడా కలిసి వస్తున్నాయి. ఒకటి - తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండోది - ఆయన తెలంగాణకు చెందిన బిసి నాయకుడు కావడం. దానికితోడు పార్టీకి నాయకత్వం వహించారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చి తెరాస మద్దతు పొందాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి ఉన్నట్లు భావిస్తున్నారు. తెరాసను అనుకూలంగా మలుచుకోవడం డిఎస్ వల్లనే సాధ్యమవుతుందనేది అంచనా. ఈ ఎన్నికల్లో కూడా తెరాసతో పొత్తు ఉండాలని డిఎస్ గట్టిగా పట్టుబట్టారు కూడా. అయితే అంతా రాజశేఖర రెడ్డిపై భారం మోపి బాధ్యతను కూడా ఆయన మీదే పెట్టి పార్టీని నడిపించే అవకాశం కూడా అధిష్ఠానం ఆయనకే ఇచ్చింది. ఒకవేళ పార్టీకి మెజారిటీ రాకపోతే దానికి బాధ్యత వహిస్తూ రాజశేఖర రెడ్డే స్వయంగా ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి తప్పుకోవచ్చునని భావిస్తున్నారు. అప్పుడు ఇటు చిరంజీవి మద్దతుతో, అటు తెరాస బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డిఎస్ ని సమర్థుడైన నాయకుడిగా అధిష్ఠానవర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను ఉన్న ఫళాన ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు.

ఎన్నికల అనంతరం డి.శ్రీనివాస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలవడంలోని రాజకీయం కూడా అదేనని అంటున్నారు. రాజశేఖర రెడ్డి నుంచి వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ భేటీకి పూనుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, తెలంగాణపై రాయలసీమ ఎన్నికల ప్రచారంలో వైయస్ చేసిన వ్యాఖ్యలను కూడా డిఎస్ సమర్థించారు. అవకాశం కలిసి వస్తున్న వేళ రాజశేఖర రెడ్డిని ఎందుకు వ్యతిరేకం చేసుకోవాలనే ఆలోచన వల్లనే డిఎస్ ఆ పనికి ఒడిగట్టినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తమకు 230 శాసనసభా స్థానాలు వస్తాయని ఇప్పటికీ అంటున్నప్పటికీ అంత నమ్మశక్యంగా లేదు. తమకు తెలంగాణలో ఇబ్బందులు తప్పలేదని డి. శ్రీనివాస్ అన్నారు. శ్రీనివాస్ పూర్తిగా బయట పడడం లేదు గానీ ఇప్పటికే ఫలితాలపై ఒక అంచనాకు వచ్చి ఉంటారు. ఇందుకు సంబంధించి తన నివేదికను ఆయన పార్టీ అధిష్ఠానవర్గానికి సమర్పిస్తారు. ఏమైనా ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్ర రాజకీయాలు కూడా అనూహ్యంగా మార్పు చెందే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+