చంద్రబాబుకు షాక్

తెలుగుదేశం పార్టీకి, ఇతర మిత్రపక్షాలకు మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం సీట్ల సర్దుబాటులో చివరి వరకు పార్టీలు ఒక నిర్ణయానికి రాకపోవడం. సీట్ల కోసం పార్టీల నాయకులు సిగపట్లు పట్టుకునే దాకా వెళ్లారు. ఇది సరైన సందేశాన్ని ప్రజలకు అందించలేకపోయింది. తెరాసకు తెలుగుదేశం ఓట్లు పడలేదు. తెలుగుదేశం ఓట్లు అది పోటీలో లేనిచోట్ల ప్రజారాజ్యం పార్టీకీ, లోకసత్తాకు, బిజెపికి పడినట్లు తెలుస్తోంది. వామపక్షాలకు గానీ తెరాసకు గానీ పడలేదు. దీనివల్ల తెలుగుదేశం మిత్రపక్షాలు సరైన ఫలితాలు సాధించలేకపోయాయి.
అలాగే, నగదు బదిలీ పథకం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లలేదు. దాని స్వరూప స్వభావాలు ఏమిటో ప్రజలకు తెలియలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు కూడా విశ్వసనీయత చేకూరలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పిన వాటికి తర్వాత చేసే దానికి పొంతన లేకపోవడం ప్రజల అనుభవంలో ఉంది. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ పలు ప్రజాకర్షక విధానాలు పద్ధతి ప్రకారం అమలు చేసింది.












Click it and Unblock the Notifications