యాష్కీకి సొంత గూటి కష్టాలు

తెలంగాణ అనుకూల నినాదంతో మధుయాష్కి ప్రజల్లో అనతి కాలంలో పేరు సంపాదించుకున్నారు. అయితే తన నియోజకవర్గం ప్రజలకు మాత్రం ఆయన దూరమైనట్లు చెబుతున్నారు. దీంతో ఆయనకు విజయం నల్లేరు మీద బండి నడక కావడం లేదు. ఎక్కువ కాలం ఆయన హైదరాబాదులో, ఢిల్లీలో, అమెరికాలో గడుపుతూ నియోజక వర్గం ప్రజలను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకిగా ముద్ర పడిన యాష్కీకి సహకరించడానికి పార్టీ శాసనసభ అభ్యర్థులు కూడా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అనుచరురాలు ఆకుల లలిత మినహా కెఆర్ సురేష్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎం. సుదర్శన్ రెడ్డి, ఎం. సుదర్శన్ రెడ్డి, జనార్దన్ గౌడ్, ఎస్ సంతోష్ రెడ్డి, ఎస్ గంగారం, బాజిరెడ్డి గోవర్దన్ యాష్కీ కోసం పని చేయడం లేదు. స్థానిక నాయకులెవరు కూడా పెద్దగా యాష్కీకి అనుకూలంగా లేరని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications