డిఎస్ పాత్ర తగ్గిందా?

D Srinivas
రాష్ట్ర కాంగ్రెసులో డి.శ్రీనివాస్ పాత్ర తగ్గినట్లే కనిపిస్తోంది. పిసిసి అధ్యక్షుడైనప్పటికీ ఆయనకు పెద్ద ప్రాధాన్యం లభించడం లేదనే మాట వినిపిస్తోంది. ఎన్నికల్లో విజయం ఫలితాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అనుభవిస్తున్నారు. ప్రభుత్వాన్నే కాదు, పార్టీని కూడా నడిపే బాధ్యతను పూర్తిగా వైయస్ స్వీకరించినట్లు భావించే పరిస్థితులు నెలకొన్నాయి. తాను స్వయంగా ఓటమి పాలు కావడం డి. శ్రీనివాస్ కు తల మీద రోకటి పోటుగా మారింది. ఎన్నికల్లో తాము పార్లమెంటుకు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి పెడతామని వైయస్ రాజశేఖర రెడ్డి పార్టీ అధిష్ఠానవర్గానికి హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. నిజానికి, ఎన్నికల వ్యూహమంతా రాజశేఖర రెడ్డి రచించినట్లే సాగింది. ఎన్నికల్లో విజయం ద్వారా అధిష్ఠానం వద్ద మాట నిలబెట్టుకున్న నాయకుడిగా ఆయనకు విశ్వసనీయత పెరిగింది. దీంతో ఆయన ప్రాబల్యం పెరిగింది.

ఎన్నికల్లో డిఎస్ పాత్ర కూడా పెద్దగా లేదు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పరిమితంగానే పాల్గొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు వైయస్ గొప్పతనంగానే గుర్తింపునకు వచ్చాయి. ఇది ఆయన విజయమేనన్నది వాస్తవం. దీంతో డిఎస్ వైయస్ రాజశేఖర రెడ్డి మాటనే వినాల్సి పరిస్థితుల్లో పడ్డారు. పార్టీ విషయంలో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేవు. ప్రతిదీ రాజశేఖర రెడ్డి చెప్పినట్లు చేయాల్సిన సంకటంలోనే ఆయన పడ్డారు. దీంతో ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు.

పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే పథకమంతా వైయస్ రాజశేఖర రెడ్డిదే. దీంట్లో డిఎస్ పాత్ర ఏమీ లేదనే చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి మాటకే నాయకులు విలువనిచ్చే పరిస్థితి. అయితే, డిఎస్ ను పూర్తిగా బేఖాతరు చేస్తున్నట్లు కూడా వైయస్ వ్యవహరించడం లేదు. ఆయన గౌరవాన్ని కాపాడుతున్నట్లు వ్యవహరిస్తూనే పార్టీపై పూర్తిగా పట్టు బిగించారు. అందువల్ల డిఎస్ పాత్ర పూర్తిగా కుంచించుకుపోయిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+