రాహుల్ కు నిజంగా అంత ఉందా?

రాహుల్ ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి:
"దేశంలో దాదాపు 60 శాతం ప్రజలు పేదవారే. ఈ సంగతి విస్మరించిన బిజెపి 2004 ఎన్నికల్లో పట్టణ ప్రజలపై దృష్టిసారించి భారత్ వెలిగిపోతుందంటూ ప్రకటనలిచ్చి బోల్తాపడింది. అయినా ఇప్పటికీ వారు పొరపాటును గుర్తించలేదు" అని రాహుల్ అన్నారు. మరోవైపు వామపక్షాల ఇందుకు భిన్నంగా కేవలం పేదలపైనే దృష్టినిలిపాయని చెప్పారు. రెండు వర్గాల (పేద, ధనిక) మధ్య సమతుల్యం ఏర్పడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అందుకే తాను గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ పేదల ఇళ్లను సందర్శిస్తున్నానని తెలిపారు.
ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని వివాదాలకు బెజెపి తెరతీస్తోందని రాహుల్ మండిపడ్డారు. "జిన్నా గురించి కేటాయించడానికి నాకు ఒక్క క్షణం కూడా తీరిక లేదు. తమ బాగు గురించి ఏం చేశారని ప్రజలు మనల్ని అడుగుతారు. కానీ చరిత్ర గురించి అడగరు" అని రాహుల్ అన్నారు. యూత్ కాంగ్రెస్‌లో పారదర్శకత: పార్టీ పెద్దలతో మంచి సంబంధాలుంటే ఎన్నికల్లో టిక్కెట్లు, ఉన్నత పదవులు రావడం లాంటి పోకడలు కాంగ్రెస్ యువజన విభాగంలో లేకుండా చేసేందుకు కృషిచేస్తున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రభావం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత స్పష్టమవుతుంది.












Click it and Unblock the Notifications