వైయస్సార్ కాంగ్రెసు?

తనను ముఖ్యమంత్రి పీఠంపై పార్టీ అధిష్ఠాన వర్గం ముందుకు రాకపోతే అనుసరించడానికి రెండు మార్గాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే అధికారం కోసం ఆయన తన పోరాటం సాగిస్తారని అంటున్నారు. రోశయ్య ప్రభుత్వంపై తన విధేయులైన మంత్రుల చేత, శాసనసభ్యుల చేత రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం ఒక్కటి కాగా, పార్టీని చీల్చి కొత్త పార్టీని స్థాపించడం రెండోది. అయితే జగన్ ను ఇబ్బందుల్లో పెట్టడానికి మొత్తం చిట్టా అధిష్ఠానం వద్ద ఉందని బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వర్గీయులు అంటున్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశాన్ని తన రాజకీయ కార్యానికి వేదికగా చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
జగన్ కు 105 మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 127 మంది సభ్యుల మద్దతు అవసరం పడుతుంది. అయితే ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసననసభ్యులు కొంత మంది, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన ఇద్దరు, ముగ్గురు శాసనసభ్యులు జగన్ కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగదేశం నుంచి దాదాపు 13 మంది, ప్రజారాజ్యం నుంచి పది మంది దాకా జగన్ ను బలపరిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సిఎల్పీలో అధిష్ఠానం రోశయ్య పేరును సూచిస్తే ఎదురు తిరగాలని ఈ జగన్ మద్దతు దారులు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా రాజకీయ సంక్షోభం సృష్టించాలనే ఆలోచనలో జగన్ వర్గం ఉన్నట్లు చెబుతున్నారు. ఒక వేళ అధిష్ఠానం తనకు మద్దతుగా రాకపోతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించే ఆలోచన కూడా జగన్ కు ఉందని చెబుతున్నారు. నల్లకాలుపలో వైయస్ సంతాప సభలో జగన్ కాంగ్రెసు పేరు గానీ, సోనియా పేరు గానీ ప్రస్తావించకపోవడంలోని ఆంతర్యం ఇదేనని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసును స్థాపించి రాష్ట్రంలో అధికారం సాధించాలనే ఎత్తుగడలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీని చీల్చే సమయంలో కూడా సోనియా మంత్రమే జపించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications