జయప్రద 'అమర' చిత్ర కథ

అయితే జయప్రద చేసిందేమిటి. నియోజకవర్గంలో ఒక్క ఈద్ రోజు తప్ప మరెప్పుడూ ఆమె కనిపించలేదు. ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధపడిన ఆమె పార్టీ కార్యాలయంలో గానీ, ఇంటి వద్ద గానీ కనిపించడం లేదు. ఇందుకు కారణమేమిటని అడిగితే - పార్టీకి ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి వెళ్లారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి, ఆమెకు అంత సీనేమీ లేదని అందరికీ తెలిసిన విషయమే. అందుకు ప్రధాన కారణం ఆజం ఖాన్ ఎదురు తిరగడమే. జయప్రదను ఇక్కడి నుంచి పోటీకి దించవద్దని ఆయన కోరుతున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. జయప్రదను ఓడించడానికి తాము పని చేస్తామని వారంటున్నారు. అవసరమైతే తమ నాయకుడు ఆజంఖాన్ చెప్తే బిజెపి అభ్యర్థి ముక్తార్ అబ్బాస్ నక్వీని గెలిపించాడనికైనా పని చేస్తామని వారంటున్నారు.
ఆజంఖాన్ ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడు. ఆజంఖాన్ మాటకు ములాయం ఓటేస్తున్నారు. దీంతో జయప్రదను వెనకేసుకొస్తున్న ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ కు కోపం వచ్చింది. తన కంటే ఆజంఖాన్ ములాయం హృదయానికి సన్నిహితుడని ఆయన ఒక సభలో అన్నారు. తాను పార్టీని వీడిపోవడానికి కూడా సిద్ధమేనని ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయితే ఆ తర్వాత మాట మార్చారు. తాను ఆ మాట అనలేదని అంటున్నారు. ఏమైనా జయప్రదకు చిక్కులు తప్పడం లేదు.
కాగా, జయప్రద ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నూర్ బానో జయప్రదపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆమె రాచ కుటుంబం నుంచి వచ్చిన మహిళ. తాను బయట నుంచి రాలేదని, తాను ఇక్కడి మనిషినేనని, తనను గెలిపిస్తే మీ మధ్యనే ఉంటానని ప్రజలకు చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఏమైనా, ఆంధ్రా జయప్రదకు చుక్కెదురవుతోంది.












Click it and Unblock the Notifications