మొయిలీతో భేటీకి మంత్రుల పోటీ

వీరప్ప మొయిలీ
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసులో ముఖ్యమంత్రి పదవి గొడవ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలుసుకోవడానికి మంత్రులు, పార్టీ నాయకులు పోటీ పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై చర్చ నెపంతో ఆయన శనివారం ఉదయం నగరానికి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చింది మొదలు ఆయనను కలవడానికి మంత్రులు, నాయకులు పోటీ పడుతున్నారు. కేవలం తాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై చర్చలు జరపడానికి మాత్రమే వచ్చానని చెప్పినప్పటికీ వారు వినడం లేదు. కొండా సురేఖ వ్యవహారం జగన్ వర్గానికి బెడిసి కొట్టడంతో పార్టీ అధిష్టానానికి విధేయత ప్రకటించడం తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయానికి ఎక్కువ మంది మంత్రులు వచ్చినట్లు తెలుస్తోంది.

సురేఖ రాజీనామాను క్షణాల్లో ఆమోదించడంతో చాలా మంది కంగు తిన్నారని అంటున్నారు. ఈ వ్యవహారంతో జగన్ శిబిరంలో నిస్తేజం అలుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరింత నష్టాన్ని నివారించుకునేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. సురేఖ రాజీనామా విషయంలో చాలా మంది మంత్రులు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడారు. శనివారంనాడు వీరప్ప మొయిలీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, బాలినేని శ్రీనివాస రెడ్డి, పితాని సత్యనారాయణ, విశ్వరూప్ లాంటి చాలా మంది ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్ వంటి మంత్రులంతా వైయస్సార్ విధేయులే. బాలినేని శ్రీనివాస రెడ్డి బంధువు కూడా. సురేఖ రాజీనామా వ్యవహారం జగన్ కు నష్టం కలిస్తుందనే అభిప్రాయం కూడా చాలా మందిలో చోటు చేసుకుంది. దీంతో జాగ్రత్త పడాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వీరప్ప మొయిలీతో మంత్రులు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై, కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం ఏర్పాటుపై చర్చించినట్లు చెబుతున్నారు. త్వరలోనే సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తామని మొయిలీ వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, జగన్ కు జరిగిన నష్టాన్ని నివారించేందుకు కొందరు మంత్రులు పూనుకున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ రాజీనామా విషయంలో జగన్ ప్రోద్బలం లేదని కొందరు మంత్రులు మొయిలీకి చెప్పినట్లు సమాచారం. సురేఖ రాజీనామా విషయంలో జగన్ పాత్ర లేదని మొయిలీ అన్నప్పటికీ అధిష్టానం ఆలోచన మాత్రం మరో విధంగా ఉందని అనుకుంటున్నారు. దీంతో మంత్రులు అధిష్టానం మనసు మార్చే ఉద్దేశంతో ఆ మాటలు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద, వీరప్ప మొయిలీ హైదరాబాద్ పర్యటన కాంగ్రెసు శాసనసభ్యులకు, మంత్రులక సవాల్ విసిరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+