బాద్షాకు వాజ్ పేయి హీరో

అయితే గాంధీ కుటుంబంతో ఎంత సన్నిహిత సంబంధాలున్నాయో షారూఖ్ కు వాజ్ పేయి కుటుంబంతో కూడా అంతే సన్నిహిత సంబంధాలున్నాయి. వాజ్ పేయి దత్త పుత్రిక నమిత తనకు మంచి స్నేహితురాలని షారూఖ్ స్వయంగా చెప్పాడు. వాజ్ పేయి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఆయన తరుచుగా నమితను కలుస్తుంటాడు. వాజ్ పేయి ప్రసంగాన్ని వినడానికి తన చిన్న తనంలో తన తండ్రి తనను న్యూఢిల్లీలోని ఐఎన్ఎ మార్కెట్ కు తీసుకొని వెళ్తుండేవాడని షారూఖ్ చెప్పాడు. వాజ్ పేయికి హిందీ భాషపై ఆధిపత్యం ఉందని, వాజ్ పేయి మంచి వక్త అని తన తండ్రి చెబుతూ ఉండేవాడని ఆయన అన్నారు. వాజ్ పేయి కోసం తన సినిమాలను షారూఖ్ ప్రదర్శిస్తుంటాడు కూడా.












Click it and Unblock the Notifications