వైయస్ గెలిచి తెలంగాణ ఓడింది

YS Rajasekhar Reddy
తెలంగాణ అంశంపై గట్టిగా మాట్లాడని కాంగ్రెస్ తెలంగాణ నాయకులంతా ఓడిపోయారు. తెలంగాణ అంశం తమ ఎజెండాలో ఉందంటూ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి బాసటగా నిలిచిన తెలంగాణ నాయకులు ఓటమి బాట పట్టారు. ఈ రకంగా ముఖ్యమంత్రి వైయస్ గెలిచి తెలంగాణ ఓడిపోయింది. మంత్రి టి.జీవన్ రెడ్డితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వరకు ఓటమి పాలై ఆశ్చర్యంలో ముంచెత్తారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాత్రం అత్యల్ప మెజారిటీతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పెట్టుకోవాలని మొదటి నుంచీ వాదిస్తూ వచ్చిన డి.శ్రీనివాస్ కు పెద్ద దెబ్బే తగిలింది. పార్టీ అధిష్ఠానం వద్ద వైయస్ రాజశేఖర రెడ్డి మాట మాత్రమే చెల్లుబాటవుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నాయకులు చాలా మంది ఆయనకు బాసటగా నిలిచారు. ముఖ్యమంత్రిని బాహాటంగా వ్యతిరేకిస్తూ వచ్చిన మధు యాష్కీ మాత్రం గెలిచారు. ఈ లెక్కన తెరాసతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే 200 దాకా శాసనసభా స్థానాలు దక్కించుకుని ఉండేదనే వాదన వినిపిస్తోంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ తెరాసతో పొత్తు పెట్టుకుని ఉంటే తెలంగాణ వాదం మరింత బలపడి ఉండేది. దాని వల్ల తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు ప్రాధాన్యం పెరిగి ఉండేది.

తమ ఓటమికి కారణం తెలంగాణ వాదం బలంగా ఉండడమే కారణమని భావిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడేం చేస్తారనేది ప్రశ్న. కె.సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, రెడ్యా నాయక్, చిన్నారెడ్డి వంటి పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. వీరు తెలంగాణ వాదాన్ని ముందుకు తెస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా అత్యధిక స్థానాలు గెలుచుకున్న రాజశేఖర రెడ్డికి అధిష్ఠానం వద్ద తిరుగు ఉండదు. ఈ స్థితిలో తెలంగాణ అలజడికి ఈ ప్రాంత నాయకులు ముందుకు రాకపోవచ్చు.

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెరాస ఘోరంగా నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ ఓట్లు గానీ వామపక్షాల ఓట్లు గానీ తెరాసకు పడలేదు. పొత్తు వల్ల తెరాస తనకు బలమైన స్థానాలను కొన్నింటిని వదిలేసింది. దీని వల్ల కూడా నష్టం జరిగింది. ఈ స్థితిలో తెలంగాణ నాయకులది దిక్కు తోచని స్థితే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+