వైయస్ దూకుడు

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అధికార పక్షాన్ని పలు మార్లు తప్పు పట్టారు కూడా. ఇరు పార్టీలు సభా సమయాన్ని తినేస్తున్నాయని అనిపించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారో లేదో గానీ ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, లోకసత్తా, వామపక్షాలు మాత్రం ప్రేక్షకపాత్ర వహించాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ పక్షాలన్నీ అధికార కాంగ్రెసు పార్టీ తీరును తప్పు పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. చాలా సమస్యలకు పరిష్కారం దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక రకంగా చర్చలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లభించడం లేదు. సమాధానాలు ఇచ్చే సమయంలో రెచ్చగొట్టే ధోరణిని ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ ఎంచుకుంటున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు సహజంగానే తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సరి కావని చెప్పడానికి తెలుగుదేశం చెప్పుకునే ప్రయత్నంలో శాసనసభా కార్యక్రమాలు స్తంభిస్తున్నాయి. ఇది కూడా అధికార కాంగ్రెసు వ్యూహంలో భాగంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
రాష్ట్రంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే మనుగడ సాగించాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికు కూడా ఉంది. ముఖ్యమంత్రికీ అదే ఉద్దేశం ఉంది. ఈ రెండు పార్టీల వ్యూహ రచనలో మిగతా పార్టీలు రెక్కలిరిగిన పక్షుల్లా విలవిలల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు, వైయస్, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నుంచి వలసలను ఆహ్వానిస్తూ వాటిని నిర్వీర్యం చేసే పనికి పూనుకున్నారు. అదే సమయంలో శాసనసభలో ఆ పార్టీలకు గొంతు విప్పడానికి కూడా అవకాశం దక్కని పరిస్థితి కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications