కెసిఆర్ కు సులభమా

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ప్రచారం చేయకుండా అడ్డుకుంటామని తెలంగాణ రాజకీయ, విద్యార్థి జెఎసిలు ప్రకటించాయి. అయితే, అది సాధ్యమయ్యే పనేనా అనేది ప్రశ్న. ఈ హెచ్చరికల నేపథ్యంలో, తెలంగాణలోని పరిస్థితుల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో కనీవినీ ఎరుగని రీతిలో బలగాలను నింపే ప్రమాదం పొంచి ఉంది. ఈ బలగాలు తెలంగాణవాదులను, తెరాస కార్యకర్తలను స్వేచ్ఛగా తిరగనిస్తాయా అనేది సందేహమే. పోలీసు పహరా మధ్య కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఏదో మేరకు తెరాస నుంచి శాససనభా స్థానాలను కైవసం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలున్నాయి.
పది స్థానాల్లో రెండు మూడు సీట్లు తెరాస నుంచి చేజారినా కెసిఆర్ నాయకత్వంపై విమర్శల జడివాన కురిసే అవకాశం ఉంది. పదే పదే రాజీనామాలు చేయడం, చేయించడం అనే కెసిఆర్ ఎత్తుగడను ఇతర పార్టీలు తప్పు పడుతున్నాయి. ఈ ప్రభావానికి ప్రజలు ఏదో మేరకు గురయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షకు, ఎన్నికలకు ముడిపెట్టి కెసిఆర్ పని చేస్తుండడంలో కూడా లోపం ఉంది. ఎన్నికలు వేరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష వేరనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ప్రజల ఆకాంక్ష పూర్తిగా వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఎన్నికల్లో విభిన్న అంశాలు పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ ఎన్నికలు కెసిఆర్ కు నల్లేరు మీద బండి నడక ఏమీ కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications