బాబు 'తెలంగాణ' జోక్

చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ, సీమాంధ్ర రెండు కళ్లని గోడ మీద పిల్లి వైఖరిని తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు అనుకూలంగా మాట్లాడడం వెనక ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఎత్తుగడ తప్ప మరేమీ లేదనేది అంటున్నారు. నిజానికి, తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే యుపిఎ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వచ్చి ఉండేది కాదు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి ఉండేవారు కాదు. తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెనక్కి నెట్టే ప్రయత్నమే కాంగ్రెసు పార్టీ చేసి ఉండేది.
యుపిఎ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు కచ్చితమైన ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. ఆ మాట మార్చడం వల్లనే ప్రక్రియ ఆగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంలో ప్రధాన విలన్ చంద్రబాబే అవుతారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు కట్టుబడి ఉంటే పరిస్థితి తిరిగి మొదటి వచ్చి ఉండేది కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మభ్య పెట్టడానికి చంద్రబాబు తెలంగాణ అంశాన్ని వాడుకుంటున్నారు. అంతేకాని ఆయనకు తెలంగాణ పట్ల ఏ విధమైన సానుకూల వైఖరి లేదనేది ఆచరణలో తేలిపోతూనే ఉన్నది. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణను, తెలంగాణ ప్రజలను జోక్ చేయడమే తప్ప మరేమీ కాదు.












Click it and Unblock the Notifications