వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యకు బాబు క్లాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ దూకుడుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కళ్లెం వేశారు. రాజకీయాలపై బాలయ్య చేస్తున్న ప్రకటనలు తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించడంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. బాలకృష్ణకు ఆయన క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. సింహా విజయం సాధించిన సందర్బంగా సందర్బంగా తన సినీ యూనిట్ తో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలను సందర్సిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు రాజకీయ ప్రకటనలు చేశారు. ప్రజల ఆదరణ ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని, పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని వంటి పలు ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలతో తీవ్ర సంచలనం చెలరేగింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బాలకృష్ణ నుంచి ముప్పు వాటిల్లనుందనే అభిప్రాయం బలపడుతూ రాసాగింది. చంద్రబాబును పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారని, బాలకృష్ణ రాష్ట్రంలో పార్టీ పగ్గాలు చేపడతారని ఊహాగానాలు చెలరేగాయి. దీంతో చంద్రబాబు తీవ్ర ఇబ్బందికి గురైనట్లే కనిపిస్తోంది.

తన రాష్ట్ర పర్యటన చేస్తున్న బాలయ్య ఇటీవల హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును కలిశారు. ఈ సమయంలో బాలయ్యకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మీడియా వద్ద ఏడి పడితే అది మాట్లాడకూడదని ఆయన మొట్టికాయలు వేసినట్లు చెబుతున్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తున్నప్పుడు తాను అలా మాట్లాడానని బాలయ్య చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదట. మీడియావారు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారని, వారికి సంచలనాలు కావాలని, మనమే జాగ్రత్తగా ఉండాలని, మీడియాను ఫేస్ చేయడం కూడా ఓ కళ అని ఆయన బావమరిదికి పూసగుచ్చినట్లు చెప్పినట్లు వినికిడి. ఏమైతైనేం, బాలయ్య వెనక్కి తగ్గారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నానని మీడియాతో చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X