చిరు టార్గెట్ చంద్రబాబు

రాజకీయాల్లో ప్రవేశించిన వెంటనే ఆ మాస్ హీరో ఇమేజ్ ఆయనను అగ్రస్థానంలో నిలబెడుతుందని అందరూ భావించారు. బహుశా, చిరంజీవి కూడా అలాగే భావించి ఉంటారు. కానీ అది జరగలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో చతికిలపడ్డారు. అయితే, తెలుగుదేశం పార్టీని నిలువరించడంలో మాత్రం ఆయన ప్రధాన పాత్ర పోషించారనే చెప్పవచ్చు. కోస్తా ప్రాంతంలోని ఇరు కులాల వైరుధ్యాలు చిరంజీవి రాజకీయ ప్రవేశంతో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీశాయి. అది కాంగ్రెసుకు కలిసి వచ్చింది.
ఇప్పుడు చిరంజీవి చంద్రబాబును ఎదుర్కోవడానికి కాంగ్రెసు చేయూత ఇస్తున్నారు. చంద్రబాబును రాజకీయంగా దెబ్బ తీయడానికే ఆయన కాంగ్రెసుతో చేతులు కలపడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును కూడా ఏదో మేరకు నిర్ణయించవచ్చు. ఏనాటికైనా తాను రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిని అవుతాననే ఆత్మవిశ్వాసం చిరంజీవికి ఇప్పుడు అవసరం.












Click it and Unblock the Notifications