దాసరి వర్సెస్ చిరంజీవి

చిరంజీవి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కొంతమంది కాపులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి గల కారణం దాసరి. తనను కాదని కాంగ్రెస్ చిరంజీవికి ప్రాదాన్యం కల్పించక పోవడాన్ని ఆయనకు నచ్చకటం లేదు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో కష్టకాలం వస్తే చిరంజీవి వైపు చూస్తుంది. ఆయనతో సంప్రతింపులు జరుపుతోంది. కొందరైతే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే వాదనలు కూడా చేశారు. 2014 లో కాంగ్రెస్, ప్రజారాజ్యం కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పరిణామాలు మొదటినుండి కాంగ్రెస్ కు అండగా ఉన్న దాసరికి నచ్చలేదు. దీనిని గమనించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ తమవైపు దాసరిని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ, దాసరి నారాయణరావులు రెండు విరుద్ద పార్టీలైన కాంగ్రెస్, తెదేపాలలో ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దాసరికి బాలకృష్ణ చాలా గౌరవం ఇస్తాడు. బాలకృష్ణ చిత్రాలకు సంబంధించిన పలు ఫంక్షన్లలో దాసరి పాల్గొంటారు. వీరిమధ్య ఉన్న బంధం కారణంగా చంద్రబాబు దాసరిని తెలుగుదేశం వైపు లాగే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్తగా పార్టీ పెట్టబోయే జగన్ కూడా ఆంధ్రలో ఎక్కువ సామాజికవర్గం ఉన్న కాపులను తనవైపు తిప్పుకొని చిరంజీవిని ఎదుర్కోవాలంటే దాసరిని తమ పార్టీలోకి సాదరంగా అహ్వానించాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆంధ్రలో జగన్ పార్టీకి మనుగడ ఉంటుంది. లేదంటే కష్టమే. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దాసరి నారాయణరావుకు మధ్య చిన్న విబేధాలు ఉండేవి. ఆ గొడవలు దాసరిని జగన్ కు దగ్గరకాకుండా తెలుగుదేశానికే దగ్గర చేస్తాయా అనేది ముందు ముందు చూడాలి.












Click it and Unblock the Notifications