గణపతి వర్సెస్ కిషన్ జీ

Maoists
పశ్చిమ బెంగాల్ ను ఒక ఊపు ఊపిన మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు ఆచూకీ దొరకడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ లో భారీ ఎదురుకాల్పులు జరిగే వరకు ఆయన ప్రతి రోజూ మీడియాతో మాట్లాడారు. హచ్ చల్ చేశారు. ఇటీవల ఆయన మాట వినిపించడం లేదు. ఎన్ కౌంటర్ లో గాయపడ్డారంటూ, మరణించాడంటూ పుకార్లు మాత్రం జోరుగా ప్రచారంలో ఉన్నాయి. అయితే మావోయిస్టుల్లో నెలకొన్న నాయకత్వ సంక్షోభం వల్లనే ఇది జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు చీఫ్ గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు, కిషన్ జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావుకు పడడం లేదని అంటున్నారు. దీనికి తోడు మావోయిస్టు ముఖ్యనేతలు చాలా మంది పోలీసులకు చిక్కడం, కొంత మంది హతం కావడం మావోయిస్టు పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టినట్లు భావిస్తున్నారు.

సిపిఐ (మావోయిస్టు)కు చెందిన 14 మంది పోలిట్ బ్యూరో సభ్యుల్లో గత మూడేళ్లలో ఆరుగురు అరెస్టయ్యారు. గణపతికి, కిషన్ జీకి మధ్య నెలకొన్న విభేదాలు దిగువ స్థాయి క్యాడర్ లో నిరాశ చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన పలు ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కిషన్ జీకి, గణపతికి మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ విషయంలో పైస్థాయిలో తీవ్ర విభేదాలున్నట్లు పోలీసులకు చిక్కిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోందని అంటున్నారు. కిషన్ జీ కుడిభుజం తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డి ఇటీవల అరెస్టయ్యాడు. పోలీసు విచారణలో అతను ఆ విభేదాలను ధ్రువీకరించినట్లు కూడా చెబుతున్నారు.

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో కిషన్ జీ, ఆయన కామ్రేడ్లు ఉద్యమాన్ని నడుపుతున్న తీరు పట్ల, భద్రతా బలగాలను ఎదుర్కునే తీరు పట్ల గణపతి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న పీపుల్స్ వార్ గ్రూప్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి) విలీనం ద్వారా 2004లో సిపిఐ (మావోయిస్టు) ఏర్పడింది. కిషన్ జీ, గణపతి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లాకు చెందినవారే. అయితే కిషన్ జీ ఉత్తరాది రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. కిషన్ జీ నడుపుతున్న లాల్ గఢ్ ఉద్యమం తీరు పట్ల గణపతి అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. స్థానిక రాజకీయాల భ్రమల్లో కిషన్ జీ చిక్కుకున్నాడని గణపతి విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, సిపిఐ (మావోయిస్టు) పార్టీలో పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసిసిల మధ్య ఆపరేషన్ విషయంలో పొత్తు కుదరడం లేదని అంటన్నారు. జార్ఖండ్ పోలీసు ఇన్ స్పెక్టర్ ఫ్రాన్సిస్ ఇందువర్ హత్య తీరును పీపుల్స్ వార్ నాయకత్వం వ్యతిరేకిస్తుండగా, ఎంసిసి క్యాడర్ సమర్థించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంసిసి కుల ప్రాతిపదికపై చీలడం కూడా పాత పీపుల్స్ వార్ నాయకత్వానికి నచ్చడం లేదని అంటున్నారు.కాగా, మావోయిస్టు అగ్రనేతల విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+