కోదండరామ్ వర్సెస్ గద్దర్

Gaddar-Kodandaram
తెలంగాణ ప్రజా సంఘాల ఉద్యమం కోదండరామ్, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్ ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ కోదండరామ్ పై గద్దర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కోదండరామ్ కు పోటీగా కార్యాచరణకు దిగుతున్నారు. దీంతో గద్దర్ విడిగా మరి కొంత మందితో కలిసి జెఎసిని ఏర్పాటు చేశారు. ఈ నెల 27వ తేదీన అన్ని జెఎసిలతో కలిసి మహబూబ్ నగర్ లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు గద్దర్ చెప్పారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ఏప్రిల్ 11న హైదరాబాదులో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాచరణకు దిగడమే కాకుండా పరోక్షంగా కోదండరామ్ పై విమర్శలు గుప్పించడానికి ఆయన సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయ జెఎసి విఫలమైందని, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు దాని వైదొలగడమే దానికి నిదర్శనమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కోదండరామ్ తనను జెఎసి సమావేశానికి ఆహ్వానించలేదని కూడా చెప్పారు. నలుగురు కూర్చుని ఏర్పాటు చేస్తే అది జెఎసి కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

కోదండరామ్ పై గద్గర్ చాలా కాలంగా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన తెలంగాణపై తన సొంత ఉద్యమానికి మరోసారి ఊపిరి పోస్తున్నారు. కోదండరామ్ నేతృత్వంలో భౌగోళిక తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరుగుతోంది. పార్టీలకు అతీతంగా తెలంగాణ రాజకీయ నాయకులను, ప్రజా సంఘాలను కూడగట్టి కోదండ రామ్ నేతృత్వంలోని జెఎసి చేస్తున్న పోరాటం జరుగుతున్నది అందుకే. కానీ గద్దర్ ప్రజాస్వామిక తెలంగాణను కోరుకుంటున్న రాజకీయాలతో ఉన్నారు. విప్లవ రాజకీయాలు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకుంటున్నాయి. ఈ విషయాన్ని గద్దర్ స్వయంగా ఒకానొక సందర్భంలో చెప్పారు కూడా. మావోయిస్టు రాజకీయాలతో తాను ఉన్నట్లు ఆయన పలు మార్లు చెప్పారు కూడా. అందువల్ల ఈ రాజకీయాలకు భౌగోళిక తెలంగాణ సాధన అనేది అంత ప్రాధాన్యం కాదు. అయితే దాన్ని కూడా ఆ రాజకీయాలు ఆహ్వానిస్తున్నాయి. భౌగోళిక తెలంగాణ ఏర్పాటును తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఆ రాజకీయాలు గుర్తిస్తున్నాయి.

గద్దర్ కు తెలంగాణ రాష్ట్ర సాధన అంత ముఖ్యం కాకపోవడమనేది ఆయన కార్యక్రమాలను బట్టి అర్థమవుతూనే ఉన్నది. తెలంగాణ ఉద్యమం వెనక తట్టు తట్టినట్లు అనిపించిన ప్రతిసారీ ఆయన నిప్పు రాజేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన మరోసారి క్రియాశీలకంగా ముందుకు వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+