చిరుతో రోజా మళ్లీ స్టెప్పులు?

Roja
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ 150 చిత్రంలో రోజా నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు అవకాశమిస్తే నటించడానికి అభ్యంతరం లేదని రోజా బహిరంగంగానే చెప్పారు. సినిమాలు వేరు, రాజకీయం వేరు అనే దృష్టి కోణంతో చిరంజీవి తన సినిమాలో గత విజయాల ఆధారంగా రోజాకు అవకాశం ఇవ్వవచ్చునని కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఒకప్పుడు చిరంజీవి, రోజాలది హిట్ ఫెయిర్. చిరంజీవితో చాలా చిత్రాల్లో నటించింది. అందులో చాలావరకు హిట్ చిత్రాలే. రాధ తర్వాత చిరంజీవితో ఎక్కువగా రోజానే అభిమానులు ఆరాధించారు. అయితే రాధ తర్వాత రోజానే చిరంజీవి అభిమానులు ఆదరించారు. సినిమాలలో హిట్ ఫేయిర్ గా వెలిగిన చిరంజీవి, రోజా, రాజకీయంలో బద్ద శత్రువుల్లా తయారయ్యారు. పచ్చగడ్డిపై నిప్పు వేస్తే రాజుకుంటుందన్నట్టుగా ఉంది వారి పరిస్థితి.

రోజా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించింది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించినప్పుడు రోజా ఆయనను వ్యక్తిగతంగా విమర్శించింది. 2009 ఎన్నికలకు ముందు ప్రచారంలో చిరంజీవి సినిమాలలో మెగాస్టార్ అయినప్పటికీ రాజకీయాల్లో అనుభవం లేదని, బ్లడ్ బ్యాంకు పేరుతు బ్లడ్ అమ్ముకుంటున్నడని ధ్వజమెత్తింది. ప్రజారాజ్యం పార్టీ నాయకులు రోజాని విమర్శించినప్పుడు రోజా పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ పై, మరికొందరు చిరంజీవి కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డారు. చిరంజీవి సినిమాల నుండి వచ్చి సినిమా హీరోయిన్లను అవమానపరిచేలా నాయకులతో మాట్లాడిస్తున్నాడని విమర్శింది. అప్పటినుండి చిరు అభిమానులు, ప్రజారాజ్యం పార్టీ నాయకులు రోజాపై గుర్రుగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఆమె పైర్ బ్రాండ్ అయ్యింది.

2009 ఎన్నికల తర్వాత కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరాలని చూసింది. అయితే కొన్ని రోజుల్లోనే ఆయన మరణించారు. ఆ తర్వాత చాలాకాలం ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు ముగింపు సభలో ఆమె మరోసారి వెలుగులోకి వచ్చారు. ఆ సభలో ఆమె జగన్ను ఆకాశానికెత్తేసింది. అయితే ఆ మరుసటి రోజు మాత్రం తాను ఏ పార్టీలో లేనని, బాధితులను ఓదార్చడానికి ఓదార్పు పేరుతో జగన్ చేస్తున్న మంచిపనిని అభినందించడానికే వెళ్లానని చెప్పారు.

ఆ తర్వాత చిరంజీవి కొత్త చిత్రం ప్రారంభం అనగానే చిరు అవకాశమిస్తే పక్కన నటించడానికి ఓకే చెప్పింది. దీంతో ప్రజారాజ్యం నాయకులు మండిపడుతున్నారు. కొందరు మాకేం అభ్యంతరం లేదంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి చిరంజీవి ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదని, అయితే ఆమె రాజకీయాలు వదిలి సినిమాల్లో మళ్లీ ప్రవేశించాలనుకుంటుందా, లేదు రెండింట్లో ఉండాలనుకుంటుందా సమాధానం చెప్పాలన్నారు. మరో నాయకురాలు వాసిరెడ్డి పద్మ చిరంజీవిని అంతగా విమర్శించిన రోజాను చిరు పక్కన అంగీకరించడానికి అభిమానులు సిద్ధంగా లేరంటున్నారు. అన్నయ్య ఒప్పుకున్నా తమ్ముళ్లయిన అభిమానులు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరని మరో నాయకుడు అంటున్నారు. ఒకవేళ అవకాశం ఇచ్చినా తల్లి పాత్రలు వేస్తున్న రోజా చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం ఉండదని, ఏదో చిన్న రోలు వేయడానికే అవకాశం ఉంటుందన్నారు. అభిమానులు కూడా కొందరు నటనకు రాజకీయానికి సంబంధం లేదనగా, మరికొందరు నటిస్తే ఒప్పుకునేది లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+