చిరంజీవి మద్దతు తీసుకుంటే....

తెలంగాణలోని ఉప ఎన్నికల్లో పోటీ చేసే సాహసం చిరంజీవి చేస్తారా అనేది అనుమానమే. అయితే, తాజా స్నేహం ప్రకారం ఆయన కాంగ్రెసుకు మద్దతు ప్రకటించాలి. చిరంజీవి మద్దతును కాంగ్రెసు పార్టీ తీసుకుంటుందా అనేది సందేహమే. ఇప్పటికే తెలంగాణలో వ్యతిరేకతను ఎదుర్కుంటున్న కాంగ్రెసు పార్టీ చిరంజీవి మద్దతు తీసుకుంటే ప్రజల ఆగ్రహావేశాలకు గురి కాక తప్పదు. సమైక్యవాది అయిన చిరంజీవితో చెలిమిని జీవన్ రెడ్డి లాంటి తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. చిరంజీవి మద్దతు ప్రకటిస్తే కాంగ్రెసుకు మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. చిరంజీవిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని తెలంగాణవాదులు అంటున్నారు. ఆయన మద్దతు తీసుకుంటే కాంగ్రెసుకు మొదటికే మోసం జరగవచ్చు. అందువల్ల కాంగ్రెసు చిరంజీవి మద్దతు తీసుకునే అవకాశం లేదు.
కాంగ్రెసు నేతలను సంప్రదించకుండా ఆ పార్టీకి చిరంజీవి ఉప ఎన్నికల్లో మద్దతు ప్రకటించే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ అలా ప్రకటిస్తే కాంగ్రెసు నాయకులు తిరస్కరించే అవకాశమే ఎక్కువగా ఉంది. దాని వల్ల చిరంజీవికి పరాభవం తప్పకపోవచ్చు. ఉప ఎన్నికలపై చిరంజీవి మౌనంగా ఉంటారా, నామ మాత్రంగా పోటీ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications