తెలంగాణ, ఏది సత్యం?

ఆర్ఆర్ఎస్ భావజాలంతో పని చేస్తున్న బిజెపి మాత్రం విమోచన దినోత్సవంగా పరిగణిస్తోంది. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవ్యాప్తంగా బిజెపి, ఎబివిపి శుక్రవారం ఆందోళనకు దిగాయి. భారత ప్రభుత్వ హోం మంత్రి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ ను బిజెపి హీరోగా పరిగణిస్తుంది. పటేల్ ధైర్యం ప్రదర్శించి నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యంపైకి ఆ రోజుల్లో సైన్యాన్ని నడిపించాడు. సైన్యం హైదరాబాద్ రాజ్యంలోకి దిగి నిజాం పోలీసులను, రజాకార్లను ఎదిరించింది. అంతకన్నా ముఖ్యంగా సాయుధ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు కార్యకర్తలపై, నాయకులపై తీవ్ర దాడులకు భారత యూనియన్ సైన్యాలు దిగాయి. ఈ స్థితిలో హైదరాబాద్ రాజ్యాన్ని నిజాం నుంచి సర్దార్ వల్లభ బాయ్ పటేల్ విముక్తం చేశాడని, ఆ రకంగా విమోచన జరిగిందని బిజెపి భావిస్తుంది.
కాగా, కమ్యూనిస్టులు విద్రోహ దినంగా పరిగణిస్తారు. విప్లవ పార్టీలు కూడా విద్రోహ దినంగానే పరిగణిస్తాయి. తెలంగాణను విముక్తం చేసి, విముక్తి ప్రాంతంగా ప్రకటించడానికి సాయుధ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను భారత యూనియన్ అణచివేసిందని, ప్రజలపై తీవ్ర దమనకాండకు దిగిందని ఈ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ రకంగా విప్లవాన్ని భారత యూనియన్ తెలంగాణలో అడ్డుకుందని అంటాయి. అందువల్ల ఇది విద్రోహ దినమని చెబుతాయి. ఈ స్థితిలో రాజకీయ పార్టీలు మధ్యే మార్గాన్ని ఎంచుకుని విలీన దినంగా పాటించాయి.












Click it and Unblock the Notifications