తెలంగాణ కోసం జయప్రద?

Jayaprada
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ బహిష్కృత పార్లమెంటు సభ్యురాలు జయప్రద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మద్దతుగా నిలబడాతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. కార్పొరేట్ వ్యవస్థతో సన్నిహిత సంబంధాలున్న అమర్ సింగ్ దేశ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మద్దతుగా నిలబడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన న్యాయవాదుల ధర్నాకు వచ్చి తన మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు మద్దతుగా నిలబడాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నేషనల్ ఫెడరేషన్ ఫర్ న్యూ స్టేట్స్ అనే సంస్థలో ఆయన ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ సమాఖ్యకు అజిత్ సింగ్ (హరిత్ ప్రదేశ్), అమర్ సింగ్ (పూర్వాంచల్), రాజా బుందేల్ (బుందేల్ ఖండ్), విజయ్ జావాంద్య (విదర్భ), సుఖ్మాన్ మహ్తాన్ (గూర్ఖాలాండ్), తెలంగాణ (నిరూప్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో మేధావులతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశానికి అమర్ సింగ్ మినహా మిగతా వారంతా వచ్చారు. అయితే అమర్ సింగ్ తరఫున ఆయన అనుచరుడు, మొరాదాబాద్ శాసనసభ్యుడు సందీప్ అగర్వాల్ వచ్చారు. ఈ సమాఖ్య కొత్త రాష్ట్రాలను సాధించాడనికి అవసరమైన కార్యాచరణను రూపొందించుకుంటోంది. ఈ స్థితిలో అమర్ సింగ్ కొత్త రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారని తెలిసిపోతూనే ఉంది.

అమర్ సింగ్ కు అత్యంత సన్నిహితురాలైన జయప్రద తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ ఇటీవల వార్తాకథనాలు వచ్చాయి. ఈ వార్తాకథనాల్లో కొంత మేరకు నిజం ఉండవచ్చు. కానీ జయప్రద అమర్ సింగ్ ను కాదని అటు వెళ్తోందా అనేది ప్రశ్న. అమర్ సింగ్ కు మద్దతుగా నిలిచి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ విమర్శల ద్వారా సంభవించే పరిణామాలకు కూడా ఆమె వెనకాడలేదు. అందువల్ల అమర్ సింగ్ ను దూరం చేసుకోవడానికి ఆమె ఏ మాత్రం సుముఖం లేరని అంటున్నారు. జయప్రద అమర్ సింగ్ వెంటే ఉంటారని సందీప్ అగర్వాల్ దట్స్ తెలుగు డాట్ కామ్ ప్రతినిధితో అన్నారు. దీన్ని బట్టి ఆమె తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది. అయితే, రాష్ట్రంలోని పరిస్థితులు, ఆమెకు గల సంబంధాలు అందుకు జయప్రదను అనుమతిస్తాయా అనేది ప్రశ్న. దీని నుంచి తప్పించుకోవడానికి ఆమె ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనే ఉండిపోయినా అశ్చర్యం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రం ఆమె మద్దతు ప్రకటించాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+