కెసిఆర్ లైవ్ స్ట్రగుల్

K Chandrasekhar Rao
తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు వ్యూహాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. కేవలం ఎన్నికలనే కాకుండా మిలిటెండ్ ఉద్యమాన్ని కూడా తన ఆయుధంగా ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. ఎన్నికల్లో పాల్గొని పలు విషయాలపై స్తబ్దుగా ఉంటూ వచ్చిన కెసిఆర్ తన పద్ధతిని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఇతర సామాజిక శ్రేణులకు చెందినవారు దూరంగా ఉంటే తన పార్టీకే ముప్పు వస్తుందని ఆయన అనుభవ పూర్వకంగా తెలుసుకున్నట్లున్నారు. దీంతో విద్యార్థులను ప్రధానంగా పోరాట రంగంలోకి దిగడాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని సాధారణ రీతిలో ఒప్పించలేమని, సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు తన సహకారం అందించే పరిస్థితుల కోసం వేచి చూడడం సరి కాదని గమనించిన కెసిఆర్ ఎల్లవేళలా ఉద్యమం క్రియాశీలకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల నాయకత్వాలను ఆయన విశేషంగా ప్రోత్సహిస్తున్నారు. ఇతర వర్గాలను కూడగడుతున్నారు. మీడియాకు కూడా రాజ్ న్యూస్ ద్వారా తెలంగాణ కోణాన్ని అందించి, తెలంగాణ ఉద్యమకారులకు గొంతునిస్తుండడమే కాకుండా వారికి నైతికంగా మద్దతిచ్చేందుకు సిద్ధపడ్డారు. పార్టీపరంగా ఇతర పార్టీ నాయకులే కాకుండా తాను కూడా అన్నివర్గాల తెలంగాణ ఉద్యమాలకు బలాన్ని సమకూరుస్తున్నారు. ఒక రకంగా మిలిటెన్సీని క్రమంగా క్రమంగా ఉద్యమంలోకి ప్రవేశపెడుతున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడం అందులో ఓ భాగమేనని భావించాలి. అదే విధంగా సీమాంధ్ర అధ్యాపకులపై విద్యార్థుల దాడిని కూడా అందులో భాగంగానే భావించాల్సి ఉంటుంది.

సీమాంధ్ర రాజకీయ నేతలు ఏదో విధంగా తెలంగాణను అడ్డుకోవడానికే ప్రయత్నిస్తారని, వారి ఒత్తిడికి కాంగ్రెసు అధిష్టానం లొంగే పరిస్థితే ఎక్కువగా ఉంటుందని ఆయన గమనించినట్లున్నారు. అందుకే, సీమాంధ్ర వర్గాలు తెలంగాణతో కలిసి ఉండడం విషయంలో ఒక రకమైన విసుగును, అయిష్టతను వ్యక్తం చేసే పరిస్థితిని కల్పించడం కూడా కెసిఆర్ వ్యూహంలో భాగమని అంటున్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న రాజకీయ పారిశ్రామికవేత్తలపై సీమాంధ్రకు చెందిన వివిధ వర్గాల నుంచి ఆ విసుగు నుంచి ఒత్తిడి పెరుగుతుందనేది ఆయన అంచనా వేస్తూ వుండవచ్చు. ఇలా విద్వేషాలతో, పరస్పర దాడులతో కలిసి ఉండడం కన్నా మన మానాన మనం ప్రశాంతంగా ఉందామనే అభిప్రాయం సీమాంధ్ర వర్గాల్లో కల్పించడం ఆయన పోరాట వ్యూహంలో ఒక భాగం కావచ్చు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే డిసెంబర్ 31వ తేదీ నాటికి తెలంగాణను పూర్తి స్థాయి ఉద్యమానికి సమాయత్తం చేయడం కూడా అందులో ప్రధానాంశం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉంటే చేయాల్సిన పోరాటం తీరుకు ఆయన ప్రయోగాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+