జగన్ కు కెవిపి దూరమే!

KVP Ramachandar Rao
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమైనట్లేనని భావిస్తున్నారు. కెవిపి రామచందర్ రావు మాటలను పెడచెవిన పెడుతూ జగన్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే పద్ధతిని ఎంచుకోవడం కెవిపికి నచ్చడం లేదంటున్నారు. అంతేకాకుండా, అధిష్టానం మనోభావాలను గుర్తించకుండా అడుగులు వేస్తే మొదటికే మోసం వస్తుందనేది కెవిపి రామచందర్ రావు అభిప్రాయంగా చెబుతున్నారు. సుదీర్ఘ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో జగన్ నడిపించాలనే ఆయన తాపత్రయమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని అంటున్నారు. వైయస్ ఉన్నప్పుడు తెర వెనక ఉంటూ అన్నీ తానై వ్యవహరించారు.

దూకుడు తత్వం, అనుభవరాహిత్యం, అపరిపక్వత వల్ల కెవిపి రామచందర్ రావు సలహాలు జగన్ చెవికి ఎక్కడం లేదని అంటున్నారు. కొంత మంది భజనపరుల మాటలతో, కొంత మంది జూనియర్ల అండదండలతో చెలరేగిపోవాలనే ఆలోచనే తప్ప వెనకా ముందులు చూసుకునే తత్వం జగన్ కు లేకపోవడం రామచందర్ రావుకు బాధ కలిగిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, తాను ముఖ్యమంత్రిని కావడానికి అనువైన విధంగా కెవిపి వ్యవహరించడం లేదని జగన్ అన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ తప్పటడుగు వేసిన ప్రతిసారీ అధిష్టానానికి నచ్చజెప్పుతూ ఇంత కాలం పరిస్థితులు జగన్ చేజారిపోకుండా కెవిపి చూసుకున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో కూడా కెవిపి జగన్ కోసం తీవ్రంగానే కష్టపడ్డారు. కానీ, ఒకదాని తర్వాత మరోటి ఆయన తప్పులు చేసుకుంటూ పోతే కష్టమనే భావనకు కెవిపి గురైనట్లు చెబుతున్నారు. మహబూబాబాద్ ఘటనలో ముఖ్యమంత్రి వైఫల్యంపై జగన్ ధ్వజమెత్తిన సందర్భంలో కెవిపి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో కెవిపి ముఖ్యమంత్రిని కలిశారు. అయితే, దాన్ని జగన్ మరో రకంగా చిత్రీకరించినట్లు చెబుతున్నారు. దాంతో జగన్ కు, కెవిపికి మధ్య దూరం మరింత పెరిగిందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా భద్రతా కమిటీ చైర్మన్ గా ఉన్న కెవిపిపై విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ సంఘటన కెవిపిని మరింత ఇరకాటంలో పెట్టేది. ఆ సంఘటనకు ప్రత్యక్షంగా జగన్ కారణం కావడం ఆయనకు మరింత సంక్లిష్టమైన సమస్యగా మారింది. ప్రజా భద్రతా కమిటీ చైర్మన్ గా ఆ సంఘటన ప్రభావం కెవిపిపై పడడం సహజం. జగన్ తొందరపాటును తగ్గించి సంయమనంతో వ్యవహరించే పద్ధతి కోసం ప్రయత్నించిన కెవిపి పూర్తిగా విఫలమైనట్లే చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+