జయప్రద, అమర్, ధోకా

Amar Singh-Jaya Prada
ముంబై‌: అప్నే, బొంబాయి మిఠాయి, చార్జిషీట్ వంటి చిత్రాల్లో నటించిన సమాజ్ వాదీ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ ఇప్పుడు చిత్ర నిర్మాణానికి పూనుకుంటున్నారు. ధోకా పేరుతో భోజ్ పురి చిత్రం నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన జీవిత కథ ఆధారంగా ఈ చిత్రనిర్మాణం జరుగుతుంది. రాజకీయ రంగంలో అమర్ సింగ్ రాజకీయానుభవాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. మనోజ్ తివారీ, సమాజ్ వాదీ పార్టీ బహిష్కృత పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి జయప్రద జంటగా నటిస్తున్నారు.

అమర్ సింగ్ ధోకా సినిమాను నిర్మిస్తున్న విషయాన్ని మనోజ్ తివారీ ధ్రువీకరించారు. మారుమూల ప్రాంతమైన రాంపూర్ లో అమర్ సింగ్ తో చిత్రానికి సంబంధించిన తొలి చర్చలు జరిగినట్లు ఆయన చెబుతున్నారు. తన చిత్రంలో నటించాలని అమర్ సింగ్ ను తాను అడిగితే వెంటనే అంగీకరించారని, అయితే తాము ప్రయాణంలో ఉండగా తాను సినిమా నిర్మిస్తానని అమర్ సింగ్ చెప్పారని ఆయన చెప్పారు. సినిమా కథకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అయితే ఈ సినిమా దేని మీద ఉంటుందో ఊహించుకోవచ్చునని ఆయన అన్నారు. విషయాలు చాలా ఉన్నాయని, స్క్రిప్టు తయారవుతోందని ఆయన అన్నారు.

అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ వంటి పెద్ద తారలు అమర్ సింగ్ కు సన్నిహితులని, అయినా వారిని కాకుండా తనను నటుడిగా అమర్ సింగ్ ఎంపిక చేసుకున్నారని, తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెబుతున్నారు. జయప్రదతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఊత్సాహంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే విషయంపై అమర్ సింగ్ తో మాట్లాడుతానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+