చంద్రబాబుకు షాక్?

Chandrababu Naidu
మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల పునరేకీకరణ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీ రామారావు వారసత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేతుల్లోంచి తెలుగుదేశం పగ్గాలు తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే సినీ నటుడు బాలయ్య తన సింహ వియోత్సవ యాత్రకు రాజకీయ కోణాన్ని జోడించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు క్లాస్ తీసుకున్న తర్వాత కాస్తా వెనక్కి తగ్గినప్పటికీ వ్యూహాత్మకంగానే ఎన్టీ రామారావు వారసత్వాన్ని సొంతం చేసుకోవాలనే ఎత్తుగడలో బాలయ్య ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, మద్దతు బాలయ్యకు ఉన్నట్లు చెబుతున్నారు.

బాలయ్య ఓ వైపు సింహ విజయోత్సవ యాత్రను రాజకీయ యాత్రగా మార్చుకున్న తరుణంలోనే చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. జూనియర్ ఎన్టీఆర్ గురువారం తన జన్మదినాన్ని నిర్వహించకున్నారు. ఆయన చంద్రబాబు సోదరి మనవరాలిని వివాహమాడుతున్న విషయం కూడా తెలిసిందే. ఈ పెళ్లి ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను తన చేతుల్లో ఉంచుకుని పార్టీని ఎల్లకాలం తన చేతుల్లో ఉంచుకోవడానికి, మిగతా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డం పెట్టడానికి చంద్రబాబు వ్యూహం రచించారనే వార్తలు వచ్చాయి. అయితే, జూనియర్ ఎన్టీఆర్ కూడా పూర్తిగా చంద్రబాబు ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. అందుకు ఆయన జన్మదిన వేడుక పరిణామాలే కారణమని అంటున్నారు. ఆయన జన్మదిన వేడుకల్లో జై ఎన్టీఆర్, జై బాలయ్య నినాదాలు వినిపించాయి. చంద్రబాబు ఊసు ఏ మాత్రం లేదు. కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా చేశారని కూడా అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు ఇతరేతర ప్రయోజనాల కన్నా స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుడిని అనిపించుకోవడానికి, ఆ కుటుంబంలో అతి ముఖ్యమని సభ్యుడిని అని అనిపించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. బాలకృష్ణకు ఆయన ఎల్లవేళలా అండదండలు అందించడానికి కూడా సుముఖంగా ఉంటారని అంటారు. వైయస్ జగన్ తెలంగాణ పర్యటన విషయంలో హరికృష్ణ బహిరంగ లేఖ రాయడం కూడా చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికేనని అంటున్నారు. కాంగ్రెసులో చేరి కేంద్ర మంత్రి అయిన సోదరి పురంధేశ్వరిని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించడం హరికృష్ణకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే, అప్పుడప్పుడు పురంధేశ్వరిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబు తీరు పట్ల హరికృష్ణకు అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, కోస్తాంధ్ర తెలుగుదేశం నాయకులు ఎక్కువ మంది బాలయ్య పార్టీ పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు వారికి నచ్చడం లేదని చెబుతున్నారు.పార్టీలోని తెలంగాణ నాయకులను చంద్రబాబు కట్టడి చేయడం లేదనే అసంతృప్తితో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో బాలయ్యకు పార్టీ పగ్గాలు దక్కితే తెలుగుదేశం పార్టీకి దశదిశ దొరుకుతుందని వారు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి మే 28వ తేదీన ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, చంద్రబాబుకు ఎన్టీ రామారావు నుంచి కష్టాలు తప్పేట్లు లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+