గైర్హాజరీ జగన్ ధిక్కారమేనా?

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఎఐసిసి సదస్సుకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ఎఐసిసి సదస్సు కన్నా ఓదార్పు యాత్రనే ప్రధానమైందా అనే ప్రశ్న తలెత్తుతోంది. తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, తనకు పార్టీ అధిష్టానం కన్నా ప్రజలే ముఖ్యమని చెప్పడానికి వైయస్ జగన్ ఎఐసిసి సదస్సుకు హాజరు కాలేదని అంటున్నారు. తనకు ఎఐసిసి సదస్సు కన్నా ఓదార్పు యాత్రనే ముఖ్యమని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నారట. అలా చెప్పడానికి కారణం లేకపోలేదని అంటున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందినవారెవరికీ ఎఐసిసి సదస్సుకు ఆహ్వానాలు రాలేదు. దీనిపై శాసనసభ్యురాలు కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన అనుచరులను బేఖాతరు చేస్తూ తనను పిలవడంలో అర్థం లేదని కూడా వైయస్ జగన్ అనుకుంటున్నారని సమాచారం.

అయితే, తనకు పార్టీ కన్నా, పార్టీ అధిష్టానం కన్నా ప్రజలే ముఖ్యమని వైయస్ జగన్ చెప్పడానికి, తన అనుచరులకు జరిగిన అవమానానికి తాను కినుక వహించానని చాటడానకి వైయస్ జగన్ ఎఐసిసి సదస్సుకు హాజరు కాలేదని చెబుతున్నారు. ఎఐసిసి సదస్సు జరిగిన మర్నాడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకులంతా క్యూ కట్టి సోనియా గాంధీని అభినందించారు. ఈ వ్యవహారంలో ఎక్కడా జగన్ లేరు. పది మందిలో ఒక్కడిగా ఉండడం ఆయనకు ఇష్టం లేదని అంటారు. ఆయన వ్యక్తిత్వంలోనే అది ఉందని, తనకు ప్రత్యేక గౌరవం ఉండాలని ఆయన కోరుకుంటారు. తనను ప్రత్యేకంగా గుర్తించి అధిష్టానం తనకు పెద్ద పీట వేస్తే తప్ప ఆయన అంగీకరించరని అంటున్నారు. జగన్ గైర్హాజరీ ఎఐసిసి సదస్సు సందర్భంగా ఎక్కడా చర్చకు రాలేదు. ఆయన మానానికి ఆయనను వదిలేసినట్లే కనిపించారు.

వైయస్ జగన్ తీరును మాత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఎఐసిసి సదస్సు కూడా జగన్ కు ఓ అవకాశమని, దానికి వచ్చి ఉంటే మరో రకంగా ఉండేదని అంటున్నారు. జగన్ పార్టీలో ఒదుగుతారా, లేదా అనడానికి అది తెలియజేసింది. జగన్ పార్టీలో ఒదిగే పరిస్థితి లేదని ఇప్పటికే సోనియా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందువల్ల వైయస్ జగన్ ఎప్పటికప్పుడు పట్టించుకోనవసరం లేదని, గుర్తించినట్లు కూడా కనిపించకూడదని ఆమె అనుకుంటున్నారని సమాచారం. అయితే, జగన్ ఎఐసిసి సదస్సుకు రాకపోవడాన్ని ధిక్కారంగానే భావించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+