రాములమ్మపై వివక్ష?

గతంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన నాయకులపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై వేలెత్తి చూపితే చేయి నరికేస్తామని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. దీనిపై బిజెపి నేతలు ఫిర్యాదు చేస్తే తప్ప ఇసి స్పందించలేదు. బిజెపి చేసిన ఫిర్యాదుపై ఇసి శ్రీనివాస్ ను వివరణ కోరింది. శ్రీనివాస్ వివరణ ఇవ్వడంతో ఇసి నిమ్మకుంది. ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదు. డి. శ్రీనివాస్ తెలంగాణ నాయకుడే అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కచ్చితంగా పోరాటం చేయకపోవడం, పాలక పార్టీకి చెందినవాడు కావడమే ఇసి చర్యలు తీసుకోకపోవడానికి కారణమని అంటున్నారు.
కాగా, గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంలో రాయలసీమలో వైయస్ రాజశేఖర రెడ్డి ఒక ప్రాంతంవారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని తెరాస నాయకులు అంటున్నారు. తెలంగాణకు వెళ్లాలంటే వీసాలు కావాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పై మరింత తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అయినా ఇసి పట్టించుకోలేదు. బట్టలు ఊడదీసి కొడ్తామని చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారు. దీనిపై కూడా ఇసి స్పందించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేస్తున్న నాయకుల పట్ల ఒక విధమైన వైఖరి, దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారి పట్ల మరో వైఖరిని ఇసి తీసుకుంటోందని తెరాస నాయకుల అభియోగం.












Click it and Unblock the Notifications