వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాపై సాక్షి డైరెక్ట్ అటాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ డైరెక్టుగా టార్గెట్ చేసింది. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ నిర్వీర్యమవుతోందనేది ఆ సాక్షి వార్తాకథనం సారాంశం. హస్తగతం శీర్షిక కింద ఈ వార్తాకథనాన్ని సాక్షి టీవీ చానెల్ ప్రసారం చేసింది. హస్తం గతం అనే అర్థం వచ్చేలా ఆ వార్తాకథనం ప్రసారమైంది. దీన్ని బట్టి వైయస్ జగన్ సోనియా గాంధీపైనే సమరం సాగించడానికి సిద్ధమయ్యారని అనుకోవచ్చు. సోనియా తన సొంత నియోజకవర్గం రాయబరేలీలో కూడా ప్రాబల్యాన్ని కోల్పోతున్నారని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని ప్రధానంగా ప్రస్తావించి, అన్ని రాష్టాల్లో కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని, రాష్ట్రాల్లో కూడా కాంగ్రెసు తన నిర్వీర్యమవుతోందని వ్యాఖ్యానించింది.

అధిష్టానానికి గడ్డుకాలమని వ్యాఖ్యానించింది. సోనియా దేశానికి ప్రధాని కారు, అధ్యక్షురాలు కారు, ఉర్రూతలూగించే ప్రసంగాలు చేయరు కానీ భారత రాజకీయాలను శాసిస్తున్నారని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రబ్బరు స్టాంపుగా కూడా అభివర్ణించింది. పార్టీకి ముస్లింలు దూరమవుతున్నారని, అయోధ్య తీర్పుపై సోనియా మౌనం వహించారని తెలిపింది. కాంగ్రెసు ప్రాబల్యం ఇక గతమేనని వ్యాఖ్యానించింది. రాయబరేలీ కోట బీటలు వారుతోందని, స్థానిక సమస్యలను సోనియా పట్టించుకోవడం లేదని, ఇందుకు ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శమని వ్యాఖ్యానించింది. బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోచీ తప్పించుకోవడానికి తగిన మార్గం ఏర్పాటు చేసింది కూడా సోనియా అనే అర్థం వచ్చేలా సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానం చేసింది.

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కె. రోశయ్య మీదనే యుద్ధం ప్రకటిస్తూ వచ్చిన వైయస్ జగన్ ఇక కొండను ఢీకొట్టేందుకు సిద్ధపడినట్లు తాజా వార్తాకథనాన్ని బట్టి అర్థమవుతోంది. కాంగ్రెసు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పూర్తిగా బలహీనపడుతోందని చెప్పడానికి ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, వైయస్ జగన్ కాంగ్రెసుతో రాజీ పడడం అనేది ఉండకపోవచ్చునని అనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X