శంకర్ కు కుచ్చుటోపీ
ఎన్నికలు పూర్తయి నెలరోజులు పూర్తయ్యాయి. శంకర్ కు ఇచ్చిన హామీని సినీ పెద్దలు పట్టించుకోవడం లేదు. దీంతో తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఫిలిం చాంబర్లో మండలి సర్వసభ్య సమావేశం జరుగుతుండగా ఓయూ విద్యార్ధి జేఏసీ, కేపీహెచ్బీ కాలనీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు భారీ సంఖ్యలో ఫిలిం చాంబర్ వద్దకు త రలివచ్చి ముట్టడికి ప్రయత్నించారు. పథకం ప్రకారమే కొంత మంది పెద్దలు తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసులు 14మంది జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఫిలిం చాంబర్ హాల్లో సినీ దర్శక సభ్యుల కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ వాది, దర్శక రచయిత ప్రేమ్రాజ్పై దాడి జరిగింది. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర సమితి ఖండించింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేవారు తీరు మార్చుకోకపోతే తగురీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించింది.